కొత్త చాలెంజ్‌లను స్వీకరించడంలో ముందు వరుసలో ఉండే హీరోయిన్ల పేర్లలో రకుల్‌ప్రీత్ సింగ్ పేరు తప్పక ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే హిందీ చిత్రం ‘సర్దార్ అండ్ గ్రాండ్‌సన్’ కోసం రకుల్ ఓ హెవీ ట్రక్‌ను నడిపి, చిత్రయూనిట్‌కు షాక్ ఇచ్చారు. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ– ‘‘నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కానీ హెవీ ట్రక్‌ను నడపడం అంత సులభం కాదు. మొదట కొంచెం నెర్వస్‌గా అనిపించినా ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో బాగా నడపగలిగాను. నా డ్రైవింగ్ స్కిల్స్ చూసి యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ట్రక్ నడపడం అనేది జీవితాంతం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అన్నారు. అర్జున్‌కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం మేలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా.. రకుల్ హిందీలో ‘మేడే, థ్యాంక్యూ గాడ్, ఎటాక్’ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ట్రక్ నడిపా.. షాక్ ఇచ్చా!
Published Sat, Apr 24 2021 3:50 AM | Last Updated on Sat, Apr 24 2021 4:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment