heavy truck
-
ట్రక్ నడిపా.. షాక్ ఇచ్చా!
కొత్త చాలెంజ్‌లను స్వీకరించడంలో ముందు వరుసలో ఉండే హీరోయిన్ల పేర్లలో రకుల్‌ప్రీత్ సింగ్ పేరు తప్పక ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే హిందీ చిత్రం ‘సర్దార్ అండ్ గ్రాండ్సన్’ కోసం రకుల్ ఓ హెవీ ట్రక్‌ను నడిపి, చిత్రయూనిట్‌కు షాక్ ఇచ్చారు. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ– ‘‘నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కానీ హెవీ ట్రక్‌ను నడపడం అంత సులభం కాదు. మొదట కొంచెం నెర్వస్‌గా అనిపించినా ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో బాగా నడపగలిగాను. నా డ్రైవింగ్ స్కిల్స్ చూసి యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ట్రక్ నడపడం అనేది జీవితాంతం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అన్నారు. అర్జున్‌కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం మేలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా.. రకుల్ హిందీలో ‘మేడే, థ్యాంక్యూ గాడ్, ఎటాక్’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. -
బరువు బలాదూరే..
రష్యా : ఈ భారీ ట్రక్కు ముందు ఎంత బరువైనా బలాదూరే. ఈ పిట్ డంప్ ట్రక్ పేరు ‘బెలాజ్ 75710’. ఈ తరహా ట్రక్కులలో ఇది ప్రపంచంలోనే అతి పెద్దదట. ఇది ఏకంగా 450 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. దీన్ని బెలారసియన్ కంపెనీ తయారుచేసింది. ప్రస్తుతం ఈ ట్రక్‌ను రష్యాలోని సైబీరియాలో ఉన్న చెర్నిగోవట్స్ ఓపెన్‌కాస్ట్ కోల్ కంపెనీలో పరీక్షిస్తున్నారు. -
భారీ లారీ భూం ఫట్!!
సాక్షి, రాజమండ్రి: ‘కాళ్ల కింద నేల కదిలిపోయినంత దిగ్భ్రాంతి కలిగింది’ అని రచయితలు రాస్తుంటారు. కానీ, భూకంపాలు సంభవించినప్పుడు కాళ్ల కింద నేల కదిలిపోవడమే కాదు.. భీకరంగా నోరు తెరిచిన రాకాసిలా ఆకాశహర్మ్యాలను సైతం మింగేస్తుంది. అయితే అలాంటిదేమీ లేకుండానే.. పొంచి ఉన్న కొండచిలువ మేకపిల్లను మింగబోయినట్టు.. రాజమండ్రి నగరం నడిబొడ్డున నేల ఓ లారీని ‘మింగబోయిన’ దృశ్యం అక్కడున్న వారిని నిజంగానే దిగ్భ్రాంతుల్ని చేసింది. బైపాస్ రోడ్‌లోని ముగ్గుపేట సెంటర్ నుంచి గోరక్షణపేటకు వెళ్లే తారురోడ్లో ఓ సిమెంట్ దుకాణం ఉంది. ఆదివారం అక్కడికి లోడుతో వచ్చిన ఓ లారీని డ్రైవర్ రోడ్డుకు ఓ పక్కగా నిలిపాడు. బస్తాలను దించుతుండగా అకస్మాత్తుగా లారీ ముందు భాగం సుమారు ఐదడుగుల లోతున నేలలోకి దిగబడిపోయి.. వెనుక భాగం గాలిలోకి లేచింది. ఏం జరిగిందో అర్థం కాక డ్రైవర్‌తో పాటు అక్కడున్న అందరూ కలవరపాటుకు గురయ్యారు. ఇంతకీ విషయమేమిటంటే.. లారీ నిలిపి ఉంచిన చోట రోడ్డు కింద నేల డొల్లలా ఉంది. రోడ్డు వేసినప్పుడు రోలర్‌తో తూతూమంత్రంగా చదును చేయించడంతో అడుగున డొల్ల భాగం అలాగే ఉండిపోయింది. లోడు లారీ వచ్చి కాసేపు ఆగేసరికి తట్టుకోలేక కుంగిపోయింది. ఊబిలో దున్నలా నడిరోడ్లో కూరుకుపోయిన లారీని చూసిన వారంతా.. ‘ఔరా! ఇదన్న మాట మన రాజమండ్రిలో రోడ్ల నాణ్యత!’ అంటూ ముక్కున వేలేసుకున్నారు.