
మలైకా ఆరోరా, అర్జున్ కపూర్
రెస్టారెంట్లకు, పార్టీలకు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌కు కలిసే వెళ్తున్నారు అర్జున్ కపూర్ అండ్ మలైకా ఆరోరా. వీరిద్దరి మధ్య మొలకెత్తిన స్నేహం ప్రేమగా మారిందని బాలీవుడ్ మీడియా ఎప్పట్నుంచో కోడై కూస్తోంది. తాజాగా వీరి వివాహనికి డేట్ కూడా ఫిక్స్ అయిందని సమాచారం. ఏప్రిల్ 19న సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో అర్జున్, మలైకా ఓ చర్చిలో వివాహం చేసుకోబో తున్నారట. అర్జున్ (33)కు, మలైకా (45)కు వయసు రీత్యా పన్నెండేళ్ల వ్యత్యాసం ఉంది. ప్రేమకు వయసుతో పనేంటి? అన్నది వీరి అభిప్రాయం కావొచ్చు. 1998లో సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్‌తో మలైకా అరోరా పెళ్లి జరిగింది. 2017లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.