
ఆయన రెండో భార్యను మీరు ద్వేషిస్తున్నారు. కానీ పదకొండేళ్ల వయస్సు గల కొడుకు..
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్- నటి మలైకా అరోరా గత కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. మలైకా విడాకులకు ముందు గుట్టుచప్పుడుగా ఉన్న ఈ జంట ఇటీవల బాహాటంగానే కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్జున్ ద్వంద్వ వైఖరి దేనికి నిదర్శనం అంటూ ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా ప్రశ్నించడం అర్జున్‌తో పాటు అతడి అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ‘ మీ అమ్మను వదిలేసి మీ నాన్న మరో పెళ్లి చేసుకున్నందుకు.. ఆయన రెండో భార్యను మీరు ద్వేషిస్తున్నారు. కానీ పదకొండేళ్ల వయస్సు గల కొడుకు ఉన్న వివాహితతో మీరెలా డేటింగ్ చేస్తారు. ఎందుకు ఈ డబుల్ స్టాండ్ అర్జున్’ అంటూ సదరు నెటిజన్ ప్రశ్నించాడు.
ఈ విషయంపై స్పందించిన అర్జున్ కపూర్..‘ నేను ఎవర్నీ ద్వేషించడం లేదు కుసుమ్. మేము ఆమెకు దూరంగా ఉన్నాం అంతే. ఒకవేళ నేను అలా చేసేవాడినే అయితే అత్యవసర సమయంలో నాన్న, జాన్వీ, ఖుషీలకు తోడుగా ఎలా ఉంటాను? టైప్ చేయడం, ఒకరిని జడ్జ్ చేయడం సులభమే. కానీ కాస్త ఆలోచించు. వరుణ్ ధావన్ ఫ్యాన్ అయిన నువ్వు ఇలాంటి నెగిటివిటి ప్రచారం చేయడం అతడి అభిమానులకు ఎంతమాత్రం నచ్చదు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన సదరు నెటిజన్ కేవలం తన అభిప్రాయం మాత్రమే పంచుకున్నానని, ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా అర్జున్‌కు క్షమాపణ కూడా చెప్పాడు.
కాగా అర్జున్ కపూర్.. బోనీ కపూర్ మొదటి భార్య మోనా కుమారుడన్న సంగతి తెలిసిందే. శ్రీదేవితో ప్రేమలో పడిన తర్వాత మోనాకు విడాకులిచ్చిన బోనీ.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అర్జున్, అతడి చెల్లి అన్షులా తండ్రికి దూరంగానే ఉన్నారు. అయితే శ్రీదేవి మరణానంతరం తండ్రి, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలతో కలిసి పోయిన అర్జున్.. ప్రతీ విషయంలోనూ వారికి అండగా నిలుస్తున్నాడు.
I don’t hate anyone Kusum. We kept a dignified distance, If I did I wouldn’t have been there for my dad Janhvi & Khushi at a sensitive time... it’s easy to type & judge, think a little. Your @Varun_dvn s fan so I feel I should tell u don’t spread negativity with his face on ur DP https://t.co/DHyHVVDPHq
— Arjun Kapoor (@arjunk26) May 28, 2019