
ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఒకప్పుడు ఐరన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ తరువాత వరుస విజయాలతో సత్తా చాటారు. ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన టైగర్ జిందాహై సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అవుతున్నారు. తాజాగా కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పొస్ట్‌పై అర్జున్ కపూర్ కామెంట్స్‌పై బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తాజాగా కత్రినా పోస్ట్ చేసిన ఒక స్లో మోషన్ వీడియోపై అర్జున్ కపూర్ ఫన్నీగా స్పందించాడు. స్లో మోషన్‌లో ఉన్న ఆ వీడియోపై అర్జున్ కామెంట్ చేస్తూ.. ‘కత్రినా, నీకు డాండ్రఫ్ ఉందా?’అని అడిగాడు. దానికి కత్రినా బదులిస్తూ.. ‘బాధపడకు నాకు తెలుసు నీకు కూడా ఇలా ట్రై చేయాలనిపిస్తోందని..మనిద్దరం కలిసి చేద్దామ’ని అన్నారు.
కత్రినా పోస్ట్ చేసిన మరో బ్లాక్ అండ్ వైట్ ఫొటోపై అర్జున్ కామెంట్ చేస్తూ...‘ప్రస్తుతం ఆల్ క్లియర్.. గుడ్ జాబ్ కత్రినా’ అని అన్నారు. దీనికి కత్రినా రిప్లై ఇస్తూ.. ‘నాకు తెలుసు నువు ఈ పోజ్‌ను ట్రై చేద్దామనుకుంటున్నావని, నేను వచ్చాక నేర్పిస్తాన’ని చెప్పారు. కత్రినా ప్రస్తుతం దబాంగ్ టూర్‌లో భాగంగా అమెరికాలో ఉన్నారు. ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ సినిమాలో కత్రినా నటిస్తున్నారు.