మరేం పర్లేదు.. నేనున్నా కదా!! | Arjun Kapoor Malaika Arora Spotted In Mumbai | Sakshi
Sakshi News home page

నీ తోడుగా నేనున్నా కదా!!

Published Wed, Nov 7 2018 2:21 PM | Last Updated on Wed, Nov 7 2018 2:27 PM

Arjun Kapoor Malaika Arora Spotted In Mumbai - Sakshi

మలైకా విడాకులకు ముందు గుట్టుచప్పుడుగా ఉన్నా ఇటీవల బాహాటంగా కలిసి తిరుగుతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. బాలీవుడ్‌ భామలు సోనమ్‌ కపూర్‌, నేహా దుఫియాలు ఈ ఏడాది ప్రారంభంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రేమపక్షులు ప్రియానిక్‌, దీప్‌వీర్‌లు కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్‌ జంట కూడా తమ స్నేహబంధాన్ని దాంపత్య బంధంగా మార్చుకునేందుకు సిద్ధమైపోయిందంటూ బీ- టౌన్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇంతకీ ఎవరా అని ఆలోచిస్తున్నారా! కాస్త ఆగండి..ఆ జంట మరెవరో కాదు బాలీవుడ్‌ హాట్‌ భామ మలైకా అరోరా- అర్జున్‌ కపూర్‌.

గత కొంతకాలంగా మలైకా- అర్జున్‌లు సన్నిహితంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మలైకా విడాకులకు ముందు గుట్టుచప్పుడుగా ఉన్నా ఇటీవల బాహాటంగా కలిసి తిరుగుతున్నారు. మిలాన్‌లో జరిగిన మలైకా బర్త్‌డేకు అర్జున్‌ కపూర్‌ ప్రత్యేకంగా హాజరవడం, ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌ గ్రూపులోకి అర్జున్‌ను ఆహ్వానిస్తూ మలైకా స్పెషల్‌ పార్టీ అరేంజ్‌ చేయడం.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్‌ మొదలయ్యాయి.  

తాజాగా ఈ జంట మరోసారి ఫొటోగ్రాఫర్ల చేతికి చిక్కింది. ముంబైలో తమ స్నేహితులు ఏర్పాటు చేసిన దీపావళి పార్టీకి హాజరైన ఈ జంటను ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. ఈ క్రమంలో మలైకాకు ఇబ్బంది కలిగినప్పటికీ తన స్వభావానికి పూర్తి విరుద్ధంగా చాలా కూల్‌గా స్పందించిన అర్జున్‌.. ఆమె చుట్టూ చేతులు వేసి జాగ్రత్తగా తీసుకువెళ్లాడు. దీంతో మలైకా కోసం అర్జున్‌ తన దుందుడుకు స్వభావాన్ని కూడా తగ్గించుకున్నాడని, ఆమె ప్రేమ అతడిని పూర్తిగా శాంత స్వభావుడిగా మార్చివేసిందంటూ గాసిప్‌ రాయుళ్లు కథనాలు మొదలుపెట్టేశారు. కాగా మలైకా గతంలో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి అర్హాన్‌ ఖాన్‌ అనే 15 ఏళ్ల  కుమారుడు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement