
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే తనకు లక్షణాలేవీ బయటపడలేదని, వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో నోట్ షేర్ చేసిన అర్జున్ కపూర్.. ‘‘నాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయం మీతో పంచుకోవడం నా కర్తవ్యం. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. లక్షణాలేవీ కనిపించడం లేదు. వైద్యులు, అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ముందుగానే ధన్యవాదాలు చెబుతున్నాను. నా ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ అసాధారణ, ఊహించని కఠిన సమయాల్లో.. మానవత్వమే వైరస్‌పై విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ప్రేమతో అర్జున్’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు.(చదవండి: అన్నికంటే అదే పెద్ద బలం: జెనీలియా )
కాగా ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్- మోనీ శౌరీ కపూర్‌ల సంతానమైన అర్జున్ కపూర్ ‘ఇష్క్‌జాదే’ సినిమాతో బాలీవుడ్‌లో హీరోగా పరిచయమ్యాడు. ఆ తర్వాత గూండే, 2 స్టేట్స్, తేవర్, నమస్తే ఇంగ్లండ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ సినిమాలతో స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గతేడాది విడుదలైన భారీ పీరియాడికల్ మూవీ పానిపట్ ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో.. మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ బాట పట్టాడు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్‌తో కలిసి హారర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’లో నటిస్తున్న అర్జున్ కపూర్.. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కిన‘భీష్మ: ది బ్యాచిలర్’ హిందీ రీమేక్‌లోనూ నటించనున్నాడు. తొలుత దర్శకుడు కావాలనే లక్ష్యంతో బీ-టన్‌లో అడుగుపెట్టిన అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలతో హీరోగా బిజీ అయ్యాడు. తనకంటే వయస్సులో పెద్దదైన మలైకా అరోరాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు.(చదవండి: తండ్రి విడిచి వెళ్లాడు.. 140 కిలోల బరువు పెరిగాడు)
Comments
Please login to add a commentAdd a comment