మన సమాజమే అంతా! | Malaika Arora Reacts to Trolls | Sakshi

మన సమాజమే అంతా!

Jul 1 2019 6:07 PM | Updated on Jul 1 2019 6:12 PM

Malaika Arora Reacts to Trolls - Sakshi

ముంబై: బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ మలైకా అరోరా.. అర్జున్‌ కపూర్‌.. వీరి మధ్య ప్రణయానుబంధమున్నట్టు చాలాకాలంగా కథనాలు వచ్చాయి. కానీ, ఇటీవల ఈ ఇద్దరూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రపంచానికి వెల్లడించారు. తాము ప్రేమలో మునిగితేలుతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే, అర్జున్‌ మలైకా కన్న వయస్సులో చిన్నవాడు. దీంతో ఈ విషయంలో ఈ కపుల్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మలైకా అరోరాకు ఈ విషయంలో దూషణలు, ఛీత్కారాలు ఎక్కువే వస్తున్నాయి. దీనిపై తాజాగా మలైకా స్పందించారు.

వయస్సులో పెద్దవాడైన ఓ వ్యక్తి తన కన్నా చిన్న వయస్సు అమ్మాయితో డేటింగ్‌ చేస్తే.. మన సమాజం అంగీకరిస్తుందని కానీ, అదే పెద్ద వయస్సు మహిళ.. చిన్న వయస్సు పురుషుడితో ప్రేమలో పడితే మాత్రం సహించదని, ఆ మహిళను ఎంతకు తెగించావు, దుష్ట మహిళ అంటూ దూషిస్తుందని ఆమె తప్పుబట్టారు. హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై మలైకా స్పందించారు. ‘అనుబంధానికి వయస్సుతో నిమిత్తం ఉండదు. ఇది రెండు మనస్సులు, రెండు హృదయాల మధ్య అనుబంధం. దురదృష్టవశాత్తు కాలంతోపాటే పురోగమించే సమాజంలో మనం లేము. ఒక పెద్ద వయస్కుడైన వ్యక్తి యువతితో రొమాన్స్‌ చేస్తే.. మనం హర్షిస్తాం. అదే ఒక పెద్ద వయస్కురాలైన మహిళ ఈ విధంగా చేస్తే.. ఆమెను ఎంతకు తెగించావు.. దుష్టమహిళ అంటూ నిందిస్తాం. అలాంటి మనుషులను నేను పట్టించుకోను’ అని తెలిపారు. అర్జున్‌తో అనుబంధం విషయాన్ని మీ కొడుకు అర్హాన్‌ ఖాన్‌కు ఎలా తెలిపారని ప్రశ్నించగా.. నిజాయితీతో కూడిన అనుబంధం గురించి చెబితే.. అందరూ చక్కగా అర్థం చేసుకుంటారని, తన కుటుంబంలోని వారందరూ తమను అర్థం చేసుకొని.. ఆనందంగా ఉన్నారని మలైకా చెప్పారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement