
Arjun Kapoor: అల్లుఅర్జున్ పుష్పరాజ్‌గా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అంచనాలను మించి వసూళ్లు అందుకుంటూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న పుష్ప చిత్రాన్ని అక్కడి సెలబ్రిటీలు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా పుష్ప ఫస్ట్ పార్ట్ చూసిన అర్జున్ కుమార్ ఈ సినిమాతో పాటు అందులో నటించిన బన్నీపై ప్రశంసలు కురిపించాడు. ఆర్య సినిమా నుంచే బన్నీకి ఫ్యాన్ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
'పుష్ప సినిమా కాదు, ఇదొక అనుభవం.. యాటిట్యూడ్, కూల్‌నెస్ రెండూ కలగలిపిన ఒక మృదువైన పొయెటిక్ మోషన్ పిక్చర్. అల్లు అర్జున్ అభిమానిగా ఆయన ఆర్య నుంచి పుష్ప వరకు ఎదిగిన తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ.. అని అర్జున్ రాసుకొచ్చాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. 'మీరు ఆ ఫైర్‌ను ఫీలైనందుకు హ్యాపీగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని రిప్లై ఇచ్చాడు. ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు బికనీర్‌లో క్వారంటైన్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment