కనెక్ట్‌ అయిపోతారు | Rakul Preet Singh To Romance Arjun Kapoor | Sakshi
Sakshi News home page

కనెక్ట్‌ అయిపోతారు

Published Thu, Nov 7 2019 12:33 AM | Last Updated on Thu, Nov 7 2019 12:33 AM

Rakul Preet Singh To Romance Arjun Kapoor - Sakshi

రకుల్‌ ప్రీత్‌సింగ్‌

‘దేదే ప్యార్‌ దే’తో ఈ ఏడాది హిందీలో సూపర్‌ హిట్‌ అందుకున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ప్రస్తుతం ‘మర్జావాన్‌’ సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నారు. తాజాగా హిందీలో ఓ కొత్త సినిమాను ప్రకటించారు. అర్జున్‌ కపూర్, రకుల్‌ ప్రీత్‌ జంటగా ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం తెరకెక్కనుంది. న్యూ ఏజ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందట.

ఎక్కువ శాతం చిత్రీకరణ పంజాబ్, లాస్‌ ఏంజల్స్‌లో జరగనుంది. కాష్వీ నాయర్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను భూషణ్‌ కుమార్, జాన్‌ అబ్రహామ్, నిఖిల్‌ అద్వానీ నిర్మించనున్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘‘ఈ చిత్రకథకు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు’’ అని రకుల్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement