
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్‌ను మరోసారి టార్గెట్ చేశాడు. అర్జున్ తన సహా నటులను వీలు చిక్కినప్పుడల్లా ఆటపట్టిస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కత్రినాను సోషల్ మీడియా వేదికగా ఆటపట్టించిన అర్జున్ మరోసారి తన ఫేమస్ ప్రకటన మ్యాంగో స్లైస్‌పై సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘హాలో ఫ్రెండ్స్ మామిడి కాలం వచ్చేసింది. ఇది చూడగానే మీకు గుర్తోచ్చేంది కత్రినా స్లైస్ యాడ్ కదా!’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. (అప్పుడు దూరాన్ని తరిమేద్దాం)
ఇది చూసిన కత్రినా ‘‘అవును.. ప్లీజ్ మీరు కూడా స్లైస్‌లు తీనాలని కోరుకుంటున్న’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి అర్జున్ ‘మా కోసం స్లైస్ తినాలని వినూత్నంగా చెప్పావు కాబట్టి.. నీకు నీలాగే ఇష్టంగా తింటానని వాగ్దానం చేస్తున్న’ అంటూ అర్జున్ కామెంట్ చేశాడు. ఇక వీరి ఫన్నీ కామెంట్స్ చూసిన నెటిజన్‌లు.. ‘‘హ హ్హా హ్హా.. కత్రినాను మీరు ఆటపట్టించిన తీరు అద్భుతం’’. ‘‘అబ్బా.. ఏం మామిడి జోక్ వేశారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (వైరల్: అర్జున్ పోస్ట్.. కత్రినా ఫన్నీ రిప్లై)
Comments
Please login to add a commentAdd a comment