
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ షేర్ చేసిన వీడియోకు కత్రినా కైఫ్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్యక్తి వినూత్నంగా క్రికెట్ ఆడుతున్న ఓ ఫన్నీ వీడియోను అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ‘క్రికెట్ ప్రేమికుడు లాక్‌డౌన్‌లో సామాజిక దూరం పాటిస్తూనే తనకు తానే క్రికెట్ ఆడుతూ మిగతా ఆభిమానులకు సవాలు విసిరాడు’ అంటూ అర్జున్ భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లిని ట్యాగ్ చేశాడు. (అందుకే విడిపోవాలనుకుంటున్నా: అలియా)
దీనికి ‘‘లాక్‌డౌన్‌లో క్రికెట్ ప్రేమికులంతా... విరాట్ కోహ్లి మీరు కూడా ఇలానే చేస్తున్నారా’’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. అర్జున్ పోస్టు చూసిన కత్రినా స్పందిస్తూ.. ‘‘నేను చేస్తాను’’ అంటూ చేయి పైకెత్తి ఉన్న అమ్మాయి ఎమోజీని జత చేశారు. దీనికి అర్జున్ ‘సెల్ఫ్ క్రికెట్’ అంటూ తల పట్టుకుని ఉన్న ఎమోజీతో తన స్పందనను తెలిపాడు. కాగా ఇంతవరకు విరాట్, అర్జున్ పోస్టుకు స్పందిచలేదు. ఇక విరాట్ దీనిపై ఎలాంటి కామెంటు చేస్తాడో వేచి చూడాల్సిందే. (‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’)
Comments
Please login to add a commentAdd a comment