బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’. దర్శకుడు కాశ్వీ నాయర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి నీనా గుప్తా కీలక పాత్రలో నటించారు. డైరెక్టర్ కాశ్వీ నాయర్‌కి తొలి సినిమా. తాజాగా చిత్ర బృందం ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ, ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ చిత్రంలో అదితీ రావ్ హైదరీ, జాన్ అబ్రహం ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ.. తన అమ్మమ్మ చివరి కోరిక తీర్చటం కోసం హీరో సాహసాలు చేయటం చూట్టూ తిరుగుతుంది.
‘ఇలాంటి పాత్రలో నేను మొదటిసారిగా నటించాను. నా పాత్రపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని ఆత్రుతగా ఉన్నాను’ అని నటీ నీనా గుప్తా తెలిపారు. ‘ తల్లితండ్రులు, కుటుంబసభ్యులు అందరూ సిద్ధంగా ఉండండి.. సర్దార్ కా గ్రాండ్‌సన్ చిత్రం ‘నెట్‌ఫ్లిక్స్’లో రాబోతుంది’ అని అర్జున్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్నొన్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, జాన్ అబ్రహం, నిఖిల్ అద్వానీ, మధు భోజ్వానీ, క్రిషన్ కుమార్, మోనిషా అద్వానీ నిర్మించారు. ఇక అర్జున్ కపూర్ చివరగా.. పానీపట్ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. బిగ్ బి అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మే డే' లో కనిపంచనున్నారు.
అర్జున్ కపూర్ - రకుల్ మూవీ.. ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో
Published Sat, Feb 27 2021 7:02 PM | Last Updated on Sat, Feb 27 2021 8:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment