బాలీవుడ్ సింగమ్ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగుతోంది.
కాగా ఈ సినిమాలో అర్జున్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, ఆ పాత్రను సైతాన్‌గా అభివర్ణిస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు రోహిత్ శెట్టి. ‘ఈ తుఫానుకు సిద్ధంగా ఉండండి’ అంటూ అర్జున్ పాత్రను ఉద్దేశించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు అజయ్ దేవగన్. రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతీ దేశ్‌పాండే నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు ‘సింగమ్ ఫ్రాంచైజీ’లో భాగంగా 2011లో ‘సింగమ్’, 2014లో ‘సింగమ్ రిటర్న్స్’ ఇప్పుడు ‘సింగమ్ ఎగైన్’ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment