‘సుశాంత్‌ ఎందుకిలా చేశాడో చెప్పలేను’ | Sushant Singh Rajput Demise Arjun Kapoor Pens Emotional Note | Sakshi
Sakshi News home page

‘సుశాంత్‌ ఎందుకిలా చేశాడో చెప్పలేను’

Published Mon, Jun 15 2020 4:04 PM | Last Updated on Mon, Jun 15 2020 5:01 PM

Sushant Singh Rajput Demise Arjun Kapoor Pens Emotional Note - Sakshi

ముంబై: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఎంతో ప్రతిభ, భవిష్యత్‌ ఉన్న సుశాంత్‌ అర్ధాంతరంగా తనువు చాలించడంతో సహ నటులు జీర్ణించుకోలేకోపోతున్నారు. తాజాగా యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. అతనితో చివరిసారిగా చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ సంభాషణ తాలూకు స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశాడు. దాంతోపాటు ఇద్దరూ కలిసున్న ఫొటోను షేర్‌ చేసి నివాళి అర్పించాడు. ‘సుశాంత్‌ ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాడో చెప్పలేను. కానీ, తను అనుకున్న దిశగా సాగి‘పోయాడు’అని అర్జున్‌ చెప్పుకొచ్చాడు. అక్కడైనా అతనికి మనశ్శాంతి దొరికిందని భావిస్తున్నానని పేర్కొన్నాడు.
(చదవండి: రంగుల ప్రపంచం వెనుక ఎన్నో విషాదాలు)

అమ్మను గుర్తుచేసుకుని..
‘2018 డిసెంబర్‌లో సుశాంత్‌ కేదార్‌నాథ్‌ సినిమా విడుదలైంది. ఆసమయంలో సుశాంత్‌ వాళ్ల అమ్మను గుర్తు చేసుకుని బాధ పడ్డాడు. ఆమె లేని లోటు అతనిలో కనిపించింది. కేదార్‌నాథ్‌కు అభినందనలు తెలపడంతోపాటు.. 2019లో విడుదల కావాల్సిన సొంచరియా సినిమాకు గుడ్‌లక్‌ చెప్పాను. సుశాంత్‌తో‌ పెద్దగా పరిచయం లేనప్పటికీ.. యశ్‌రాజ్‌ ఫిలింస్‌లో జరిగే షూటింగులు, ఈవెంట్లలో అప్పుడప్పుడూ కలిసేవాళ్లం. బహుశా అమ్మ ఉంటే సుశాంత్‌ తన వ్యధను ఆమెకు చెప్పుకునేవాడు కావొచ్చు’అని అర్జున్‌ కపూర్‌ ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చాడు.
(చదవండి: సుశాంత్‌ మరణంపై సన్నీ లియోన్‌ భావోద్వేగ లేఖ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement