Arjun Kapoor Sell His Bandra Apartment, Know Details In Telugu - Sakshi
Sakshi News home page

Arjun Kapoor: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో!

Published Thu, Jul 21 2022 4:18 PM | Last Updated on Thu, Jul 21 2022 5:00 PM

Arjun Kapoor Sell His Bandra Apartment, Know Details - Sakshi

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ నటించిన తాజా చిత్రం ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌. 2014లో రిలీజైన హిట్‌ మూవీ ఏక్‌ విలన్‌కు ఇది రీమేక్‌. ఆస్మన్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 29న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు హీరో.

ఇదిలా ఉంటే తాజాగా అర్జున్‌ కపూర్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. గతేడాది అతడు బాంద్రాలో కోట్లు పెట్టి కొత్త ఫ్లాట్‌ కొన్న విషయం తెలిసిందే కదా. ప్రియురాలు మలైకా అరోరాకు దగ్గరలో ఉండొచ్చని ఆలోచించిన అర్జున్‌ ఏకంగా రూ.20 కోట్లు పెట్టి ఆ ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు. సడన్‌గా ఏమైందో ఏమో తెలీదుగానీ అతడు తన ఫ్లాట్‌ను అమ్మేశాడట! రూ.16 కోట్లకే దాన్ని వదిలించుకున్నాడట. ప్రస్తుతం అతడు జుహులో నివసిస్తున్నాడు.

చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతున్న నయన్‌-విఘ్నేశ్‌ల పెళ్లి వీడియో
దుమ్ము లేపుతున్న లైగర్‌, కటౌట్‌ చూసి కొన్ని నమ్మేయాలంతే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement