
ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా? అంటూ బాలీవుడ్ నటుడు అర్జున్‌కపూర్ శ్రద్ధాకపూర్‌ని ఆటపట్టించారు. సాహో చిత్రంలోని కొన్ని ఫోటో స్టిల్స్‌ను శ్రద్ధాకపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఒక ఫోటోలో శ్రద్ధ రెడ్‌కలర్ గౌన్ ధరించి ఉండగా, అదే కలర్ ఉన్న పౌడర్ ఆమె చూట్టూ ఆవరించి ఉంది. అర్జున్ ఈ ఫోటోకే ఫన్నీగా కామెంట్ పెట్టారు. శ్రద్ద గట్టిగా తుమ్మడం వల్లే అంత దుమ్ము లేచిందని అన్నారు. సాహో సినిమా యూనిట్ రీసెంట్‌గా ఏ చోట నువ్వున్నా.. అనే పాటని విడుదల చేసింది.
ఈ పాటను ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్‌లలో షూట్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోన్న శ్రద్ధా పాట చిత్రీకరణ సందర్భంగా మంచుపర్వతాల ముందు నిల్చుని కొన్ని ఫోటోలు దిగారు. వాటిని ఈ మధ్యనే సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అర్జున్‌కపూర్ ఇలా హీరోయిన్స్‌ను ఆట పట్టించడం ఇదే మొదటిసారి కాదు. కత్రినాకైఫ్ బికినీ వేసుకొని పిల్లర్ పక్కన నిలబడిన ఫోటోను చూపిస్తూ. ‘ఈ అమ్మాయి ఎక్కడికిపోతోంది.. అలాగే పిల్లర్‌లోకి వెళ్తుందేమో జాగ్రత్త’ అని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌కు స్పందించిన కత్రినా ‘నా జాగ్రత్త నేను చూసుకుంటానులే’ అని రిప్లై కూడా ఇచ్చింది. కాగా అర్జున్, శ్రద్ధాలు హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో కలసి నటించారు.
