
అర్జున్ కపూర్
‘‘కరోనా వైరస్ అనేది చాలా సీరియస్ విషయం. చిన్నా పెద్దా అనే తేడా దానికి లేదు. కొందరు కరోనాని తేలికగా తీసుకోవచ్చు. కానీ అది అంత తేలిక కాదు. అందుకే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్‌తో ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్. గత నెలలో అర్జున్‌కు కరోనా పాజిటì వ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ‘‘నేను నెగిటివ్ అని తేలటంతో ఆనందంగా ఉంది. పూర్తిగా కోలుకున్నాను’’ అన్నారు అర్జున్. ‘‘ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ నియంత్రణకు శ్రమిస్తున్న ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు పెద్ద సెల్యూట్. హ్యాపీగా నా పనులు మొదలుపెట్టేశా’’ అని కూడా అర్జున్ కపూర్ అన్నారు.