హీరోవి నీకేం తక్కువ? నువ్వే కాపాడొచ్చు కదా‌? | Actor Arjun Kapoor Satirical Reply To User For Trolling On His Earnings | Sakshi
Sakshi News home page

నాకు రోజుకు రూ.16 కోట్లు రావు: ట్రోలింగ్‌పై హీరో రిప్లై

Published Fri, Apr 16 2021 4:00 PM | Last Updated on Fri, Apr 16 2021 6:01 PM

Actor Arjun Kapoor Satirical Reply To User For Trolling On His Earnings - Sakshi

సోషల్‌ మీడియా వచ్చాక ప్రతివాడికి ఎదుటివాళ్లను చులకన చేసి మాట్లాడటం ఈజీ అయిపోయింది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం మాట్లాడినా, ఏ పోస్టు పెట్టినా వారిని విపరీతంగా ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. దీనిపై కొందరు సెలబ్రిటీలు మౌనం వహించినప్పటికీ మరికొందరు మాత్రం వాళ్ల ఆట కట్టించేందుకు ఘాటు రిప్లై ఇస్తారు. బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ కూడా అదే కోవలోకి వస్తాడు. అతడు తాజాగా ఓ బాలుడి ఫొటోను షేర్‌ చేశాడు. దాతలు ఎవరైనా పెద్దమనసుతో ముందుకొచ్చి ఈ పిల్లవాడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయం చేయగలరు అని రాసుకొచ్చాడు.

అర్జున్‌ చేస్తున్న మంచిపనికి ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. కానీ ఓ నెటిజన్‌ మాత్రం.. నీ ఒక్కరోజు జీతంతో అతడిని కాపాడొచ్చు కదా అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇది చూసిన అర్జున్‌.. "నేను నిజంగా రోజుకు రూ.16 కోట్లు సంపాదిస్తే ఈ పోస్ట్‌ పెట్టాల్సిన అవసరమే రాకపోయేది. అంత మొత్తం డబ్బులు ముట్టజెప్పకపోయినా ఎంతోకొంత నా వంతు సాయం చేశాను. వీలైతే మీరు కూడా సాయం చేయండి" అని బదులిచ్చాడు. ఎంతో కూల్‌గా ఆన్సర్‌ ఇచ్చిన అర్జున్‌ కపూర్‌ను చూసి ఫ్యాన్స్‌ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆ బాలుడు ఆరోగ్యవంతుడయ్యేందుకు తమవంతు సాయం అందిస్తామంటూ ముందుకు వస్తున్నారు.

చదవండి: బాలీవుడ్‌ నటి సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌! నిజమేనా?

ఊర్వశి వజ్రాల మాస్కు: రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement