రెస్టారెంట్‌లో ప్రియురాలికి నిప్పుపెట్టాడు.. | Woman set on fire in Japan restaurant | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్‌లో ప్రియురాలికి నిప్పుపెట్టాడు..

Published Sat, Nov 12 2016 12:43 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

రెస్టారెంట్‌లో ప్రియురాలికి నిప్పుపెట్టాడు..

రెస్టారెంట్‌లో ప్రియురాలికి నిప్పుపెట్టాడు..

టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యోలోని ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ప్రియురాలితో గొడవపడి ఆమెకు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇరాన్‌ సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి, ఫిలిపిన్స్‌కు చెందిన మహిళ (36)తో కలసి ఉత్తర టోక్యోలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు వాదులాడుకుని గొడవపడ్డారు. ఆయన గాళ్‌ ఫ్రెండ్‌పై లిక్విడ్‌ పోసి నిప్పుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు కూడా మంటలకు తగిలాయి. రెస్టారెంట్‌లో పనిచేస్తున్నవారు వెంటనే అంబులెన్స్‌కు ఫో​న్‌ చేశారు. మంటలను ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ జంటకు పలుచోట్ల గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి ఉన్న వీరికి చికిత్స అందిస్తున్నారు. కాగా రెస్టారెంట్‌లో ఇతరులకు ప్రమాదం జరగలేదని పోలీసులు చెప్పారు. హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement