సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో దేశంలోని అన్నివిమానాశ్రయాలకు కేంద్రప్రభుత్వం శనివారం మరోసారి అలర్ట్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులతోపాటు, అన్ని విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ హెచ్చరిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతోపాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అధికారులకు భద్రతాపరమైన కఠిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా హెచ్చరించింది.
పుల్వామా దాడుల తరహా దాడులు జరగవచ్చన్న ఇంటిలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టాలని ఆదేశించింది. 20రకాల ప్రత్యేకమైన భద్రతా చర్యలను తీసుకోమని కోరింది. సిబ్బంది సహా ప్రయాణీకుల బ్యాగేజీ మెరుగైన స్క్రీనింగ్, ప్రయాణికుల 100శాతం తనిఖీ, ఎయిర్‌పోర్టుల ముందు ఎలాంటి వాహనాల పార్కింగ్‌కుఅవకాశం లేకుండా చూడటం లాంటి భద్రతా చర్యలను మెరుగుపరచటం చాలా అత్యవసరమని పేర్కొంది. టెర్రరిస్టు వ్యతిరేక, విధ్వంసక వ్యతిరేక చర్యలు నిరోధించాలని ఆదేశించింది. అలాగే మైక్రోలైట్ విమానం, ఏరో మోడల్స్, పారా గ్లైడర్స్ మానవరహిత వైమానిక వ్యవస్థలు, డ్రోన్స్, పవర్ హ్యాంగ్ గ్లైడర్స్ , హాట్ ఎయిర్ బెలూన్స్ లాంటి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment