ఎయిర్‌పోర్టులు, రైల్వేలపై తాజా నిర్ణయం | key decision on airports, the Indian Railway | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులు, రైల్వేలపై తాజా నిర్ణయం

Published Mon, Nov 14 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

ఎయిర్‌పోర్టులు, రైల్వేలపై తాజా నిర్ణయం

ఎయిర్‌పోర్టులు, రైల్వేలపై తాజా నిర్ణయం

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో దేశంలో నగదు కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో పాత నోట్లను అంగీకరించే గడువును ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది. అదేవిధంగా విమానాశ్రయాల్లోనూ పార్కింగ్‌ చార్జీల రద్దును ఈ నెల 21 అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపింది.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదన్న ఉద్దేశంతో పార్కింగ్‌ చార్జీల రద్దును ఈ నెల 21వరకు కొనసాగిస్తున్నట్టు పౌరవిమానయానశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పాతనోట్లను అన్నీ రైల్వేస్టేషన్లలో యథాతథంగా అంగీకరిస్తామని, అదేవిధంగా ప్రయాణసమయంలో క్యాటరింగ్‌ సేవలకు కూడా పాతనోట్లను వినియోగించవచ్చునని రైల్వేశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక అన్నీ జాతీయ రహదారులపైనా టోల్‌ రుసుమును ఈ నెల 24వరకు రద్దుచేసిన సంగతి తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement