big cash ban
-
ఎయిర్పోర్టులు, రైల్వేలపై తాజా నిర్ణయం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో దేశంలో నగదు కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో పాత నోట్లను అంగీకరించే గడువును ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది. అదేవిధంగా విమానాశ్రయాల్లోనూ పార్కింగ్ చార్జీల రద్దును ఈ నెల 21 అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదన్న ఉద్దేశంతో పార్కింగ్ చార్జీల రద్దును ఈ నెల 21వరకు కొనసాగిస్తున్నట్టు పౌరవిమానయానశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి వరకు పాతనోట్లను అన్నీ రైల్వేస్టేషన్లలో యథాతథంగా అంగీకరిస్తామని, అదేవిధంగా ప్రయాణసమయంలో క్యాటరింగ్ సేవలకు కూడా పాతనోట్లను వినియోగించవచ్చునని రైల్వేశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక అన్నీ జాతీయ రహదారులపైనా టోల్ రుసుమును ఈ నెల 24వరకు రద్దుచేసిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రపతి వద్దకు పెద్దనోట్ల రగడ!
-
నోట్ల రద్దుతో పంచాయతీల పంట పండింది!
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు అంశం తెలంగాణలోని గ్రామపంచాయతీలకు అనూహ్యంగా కలిసివచ్చింది. రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లతో ఆస్తిపన్ను చెల్లించేందుకు అవకాశం ఇస్తుండటంతో జనాలు తమ ఆస్తిపన్నును, బకాయిలు చెల్లించేందుకు పోటెత్తుతున్నారు. దీంతో తెలంగాణ అంతటా ఆస్తిపన్ను చెల్లింపులకు విశేషమైన స్పందన లభిస్తోంది. మూడురోజుల్లో రాష్ట్రంలోని పంచాయతీలకు ఆస్తిపన్ను రూపంలో ఏకంగా రూ. 16 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. బాకాయిపడ్డ ఆస్తిపన్ను చెల్లించేందుకు సైతం గ్రామీణులు పంచాయతీల ముందు బారులు తీరుతున్నారు. పాతనోట్లతో పన్ను చెల్లించేందుకు రేపటివరకు గడువు ఉండటంతో సోమవారం కూడా భారీమొత్తం ఆస్తిపన్ను చెల్లింపులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిపడిన ఈ అనూహ్య ఆదాయంతో గ్రామపంచాయతీలు నిధులతో కళకళలాడుతున్నాయి. -
ప్రధాని మోదీపై సీనియర్ లీడర్ ప్రశంసలు
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానిమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పార్టీలు విముర్శలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. ఎన్సీపీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ నుంచి ఊహించనిరీతిలో ప్రశంసలు దక్కాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని శరద్ పవార్ స్వాగతించారు. ఇది సరైన నిర్ణయమని పేర్కొన్నారు. శరద్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సీనియర్ నేత పవార్ అని ప్రశంసించారు. -
పెద్దనోట్ల రద్దు: రంగంలోకి పీఎంవో!
న్యూఢిల్లీ: డబ్బును పొందడానికి బ్యాంకుల ముందు, పోస్టాఫీసుల ముందు ప్రజలు గంటలుగంటలు తీవ్రకష్టాలు పడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా డబ్బు ఉపసంహరణ ఎలా సాగుతున్నదో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని అధికారులను కోరింది. ‘ప్రధానమంత్రి దేశంలోకి వచ్చారు. ఆయన త్వరలోనే బ్యాంకుల అధిపతులు, ఇతర భాగస్వాములతో దేశంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. (కరెన్సీ మార్పిడి అంశంపై) ప్రధాని ఇప్పటికే నివేదిక కోరారు’ అని పీఎంవో వర్గాలు మీడియాకు తెలిపాయి. నోట్లరద్దుపై ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పాల్గొననున్నారు. పెద్దనోట్ల కరెన్సీ రద్దు నిర్ణయం ప్రకటించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడురోజుల జపాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. జపాన్ పర్యటన ముగించుకొని భారత్ వచ్చిన ఆయన పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న పాట్లపై స్పందించిన సంగతి తెలిసిందే. తనకు 50 రోజుల సమయం ఇస్తే ప్రజల కష్టాలను దూరం చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మరోవైపు ఆర్బీఐ కూడా తమ తగినంత కరెన్సీ ఉందని, ఈ విషయంలో భయాలు వద్దని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రపతి వద్దకు పెద్దనోట్ల రగడ!
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఆకస్మిక సంచలన నిర్ణయంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీలకతీతంగా ఉమ్మడిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువాలని నిర్ణయించినట్టు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తెలిపారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలతో తాను మాట్లాడానని ఆమె తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనాగరికమని, ఈ చర్యను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. సామాన్యులకు ఊరట కలిగేలా రాజకీయ పార్టీలతో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని చెప్పారు. ఈ విషయమై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఫోన్లో మాట్లాడానని తెలిపారు.