విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌ | Mumbai, Hyderabad, Chennai airports on high alert after hijack threat | Sakshi
Sakshi News home page

విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌

Published Mon, Apr 17 2017 2:13 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌

విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌

హైజాక్‌ హెచ్చరికలు శంషాబాద్, చెన్నై, ముంబైల్లో భద్రత పెంపు
న్యూఢిల్లీ: శంషాబాద్‌తో పాటు చెన్నై, ముంబై విమానాశ్రయాల్లో హైజాక్‌కు కుట్ర పన్నారంటూ హైదరాబాద్‌ నుంచి ఓ మహిళ పంపిన ఈమెయిల్‌ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ఈ మూడు విమానాశ్రయాల్లో ఆదివారం హైఅలర్ట్‌ ప్రకటించారు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సమ యంలో చేపట్టే అత్యున్నత స్థాయి భద్రతా వలయాన్ని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌), పోలీసులు ఏర్పాటు చేశారు.

‘మొత్తం 23 మందీ ఇక్కడి నుంచి విడిపోయి మూడు నగరాల్లో విమానాలెక్కి హైజాక్‌కు పాల్పడతారని ఆరుగురు యువకులు చెప్పుకుంటుండగా విన్నాను’ అంటూ హైదరా బాద్‌కు చెందినట్టు భావిస్తున్న ఓ మహిళ శనివారం రాత్రి ముంబై పోలీసులకు ఈ–మె యిల్‌ పంపించారని సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఓపీ సింగ్‌ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ మూడు విమానాశ్రయాల్లో అదనపు బలగాలను మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామన్నారు.

ఈమెయిల్‌ గాలివార్తే అయివుండవచ్చని, కానీ... ముందు జాగ్రత్తగా హైజాక్‌ లాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలనూ చేపట్టామన్నారు. ‘ఈ వార్త నిజమో కాదో తెలియదు. కానీ... దేశ పౌరురాలిగా ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేయడం నా బాధ్యత’అంటూ గుర్తు తెలియని మహిళ ఈమెయిల్‌లో పేర్కొన్నట్టు సింగ్‌ తెలిపారు. రంగంలోకి దిగిన ముంబై పోలీసులు వెంటనే సంబంధిత విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారన్నారు.

సీఐఎస్‌ఎఫ్‌ సహా సంఘ విద్రోహక చర్యలను నియంత్రించేందుకు ప్రత్యేక బలగాలు ఆదివారం తెల్లవారుజాము నుంచి అడుగడుగునా తనిఖీలు చేశాయి. వీటితోపాటు దేశంలోని ఇతర విమానాశ్రయాల అధికారులను కూడా అప్రమత్తం చేశాయి. అయితే విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్టు చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. కాగా, ఈమెయిల్‌ సమాచారంలో వాస్తవమెంత... అది పంపిన మహిళ ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలోనూ రెడ్‌అలర్ట్‌
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): వీటితోపాటు ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఆదివారం విశాఖ విమా నాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో పాటు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు, సివిల్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించి, గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement