న్యూఢిల్లీ\ముంబై : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులపై నిఘా సంస్థల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. అవాంఛనీయ ఘటనలను నిరోధించేందుకు భద్రతను ముమ్మరం చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సెక్యూరిటీ అడ్వైజరీని జారీ చేసింది.
విమానాశ్రయాలతో పాటు కీలక స్ధావరాల వద్ద భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని కోరింది. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులు విమానాశ్రయాలను తమ టార్గెట్‌గా ఎంచుకుని విరుచుకుపడవచ్చని నిఘా సంస్థలు సమాచారం అందించాయి.
Comments
Please login to add a commentAdd a comment