
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విమానాశ్రయాల కనెక్టివిటీకి సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి.. నెలలోగా ఏవియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ముసాయిదా నివేదికను సమర్పించాలని సీఎస్ ఎస్‌కే జోషి ఆదేశించారు.
గురువారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి ప్రస్తుతమున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వినియోగించుకోవడంతోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించాలన్నారు.
అకాడమీ నిర్వహిస్తోన్న 5 ఏళ్ల ఏవియేషన్ కోర్సు ద్వారా 100% ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. విదేశాల్లోనూ ఈ రంగంలో రాష్ట్ర యువత ఉద్యోగాలు పొందేలా కొత్త కోర్సులను ప్రారంభించాలన్నారు. అకాడమీ ద్వారా పైలట్ ట్రైనింగ్ పొందిన వారిలో 80 శాతం ఉద్యోగాలు పొందుతున్నారని, ఆచరణాత్మక జ్ఞానం కోసం ఎయిర్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment