విమానాశ్రయాల్లో ప్రాంతీయ భాషల్లో అనౌన్స్‌మెంట్స్‌ | Airports Announcements in regional languages | Sakshi
Sakshi News home page

విమానాశ్రయాల్లో ప్రాంతీయ భాషల్లో అనౌన్స్‌మెంట్స్‌

Published Thu, Dec 27 2018 1:32 AM | Last Updated on Thu, Dec 27 2018 1:32 AM

Airports Announcements in regional languages - Sakshi

న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ఎయిర్‌పోర్టులలో ముందుగా స్థానిక భాషలో ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్‌లలో పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్స్‌ చేయాలంటూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ  (ఏఏఐ) 2016లోనే తన పరిధిలోని ఏరోడ్రోమ్స్‌ అన్నింటికి  ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌ జారీ చేసింది. తాజాగా ప్రైవేట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్స్‌కి కూడా ఈ మేరకు పౌర విమానయాన శాఖ ఆదేశాలు పంపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందకు పైగా ఎయిర్‌పోర్టులు పనిచేస్తున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement