Airports Authority
-
వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఓకే?
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. మామునూరులో ఉన్న పురాతన ఎయిర్ స్ట్రిప్ స్థానంలో దీనిని నిర్మించనున్నారు. రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదించినా, పౌర విమానయాన శాఖ–రాష్ట్రప్రభుత్వం మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ కారణంగానే వీటి ఏర్పాటు సందిగ్ధంలో పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకొచ్చి దశలవారీగా ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. తొలుత వరంగల్‌లో విమానాశ్రయాన్ని సిద్ధం చేసే కసరత్తులో భాగంగా, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ కోరిన మేరకు భూమిని సేకరించి అప్పగించనుంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు సమావేశ ఎజెండాలో కూడా దీనిని చేర్చారు. 250 ఎకరాల భూసేకరణ మామునూరులో నిజాంకాలంలో నిర్మించిన ఎయిర్‌స్ట్రిప్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇది వాడుకలో లేదు. అక్కడ చిన్నòÙడ్డు తప్ప ఎలాంటి భవనం లేదు. ఒక పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే ఉంది. గోతులు పడి అది కూడా వినియోగించడానికి వీలు లేదు. ప్రస్తుతం ఆ ఎయిర్‌స్ట్రిప్‌కు సంబంధించిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అ«దీనంలో ఉంది. అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అంతమేర భూసేకరణ జరగాల్సి ఉంది. సమీపంలోనే పశసంవర్థక శాఖ కు చెందిన స్థలం అందుబాటులో ఉంది. కొంత సమీప గ్రామం నుంచి సేకరించాల్సి ఉంది. గ్రామస్తులకు ఎయిర్‌పోర్టుకు మరోవైపు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చే పద్ధతిలో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్‌కు ఈమేర కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఏడాదిన్నరలో సిద్ధం చేసేలా.. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని రూ.350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎయిర్‌స్ట్రిప్‌లో 1400 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది. దాని పక్కనే గ్లైడర్స్ దిగేందుకు అప్పట్లో మరో చిన్న రన్‌వే నిర్మించారు. ఇప్పుడు 2300 మీటర్ల పొడవుతో ఒకటే రన్‌వే కొత్త విమానాశ్రయం కోసం సిద్ధం చేస్తారు. రన్‌వే విస్తరణ, టెర్మి నల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్విసెస్‌కు ఈ అదనపు భూమి అవసరమవుతోంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది క్వార్టర్లను మరో చోట నిర్మించాలని నిర్ణయించారు. భూమిని సేకరించి అథారిటీకి అప్పగించిన ఏడాదిన్నరలోగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తు తం దేశీయ విమానాశ్రయం (డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు)గానే ఏర్పాటు చేయనున్నారు. 500 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది రూపొందనుంది. భవిష్యత్ అవసరాల ఆధారంగా విస్తరిస్తారు. దశలవారీగా ఇతర చోట్ల కూడా.. వరంగల్ మామునూరుతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. వీటిని దశలవారీగా చేపట్టాలని ఇప్పుడు నిర్ణయించారు. హైదరాబాద్ తర్వాత అంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం వరంగల్ కావటం, అక్కడ టెక్స్‌టైల్‌పార్కు, ఐటీ పార్కులు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అక్కడ తొలుత విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
మాస్క్ సరిగా ధరించకుంటే ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను అప్రమత్తం చేసింది. ప్రయాణికులు కోవిడ్ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరింది. మాస్క్ సరిగా ధరించని వారిని, భౌతిక దూరం పాటించని వారిని గుర్తించి అక్కడికక్కడే జరిమానా విధించడం వంటి చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు మార్చి 13వ తేదీన డీజీసీఏ అన్ని విమానాశ్రయాలకు, విమానయాన సంస్థలకు ఈ మేరకు సూచనలు చేసింది. అయితే, కొన్ని విమానాశ్రయాల్లో కోవిడ్–19 ప్రొటోకాల్స్ ఉల్లంఘనలు ఇంకా కొనసాగుతున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ మంగళవారం తాజాగా మరో సర్క్యులర్ జారీ చేసింది. ‘ప్రయాణికులు ముక్కు, నోరు కవరయ్యేలా ముఖానికి మాస్క్‌ను సరిగ్గా ధరించడం మొదలుకొని విమానాశ్రయ పరిసరాల్లో భౌతిక దూరం పాటించడం వంటి అన్ని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా విమానాశ్రయాల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు నిఘాను మరింత పెంచాలి’అని అందులో కోరింది. ‘నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం అక్కడికక్కడే జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో స్థానిక పోలీసు అధికారుల సహకారం తీసుకోవాలి’అని సూచించింది. పదేపదే హెచ్చరించినా కోవిడ్–19 ప్రొటోకాల్‌ను పాటించని ప్రయాణికులను విమా నాశ్రయాల అధికారులు వెంటనే భద్రతా సిబ్బం దికి అప్పగించాలని మార్చి 13వ తేదీ నాటి సర్క్యులర్‌లో తెలిపింది. దీంతోపాటు, పలుమార్లు హెచ్చరించినా నిబంధనలను పాటించడానికి నిరాకరించే ప్రయాణికులను విమానం నుంచి దించివేయాలని, అటువంటి వారిని నిబంధనలు పాటించని ప్రయాణికులుగా గుర్తించాలని కూడా సూచించింది. ఇలా గుర్తించిన ప్రయాణికులపై విమానయాన సంస్థలు మూడు నుంచి 24 నెలల వ రకు ప్రయాణ నిషేధం విధించవచ్చని డీజీసీఏ నిబంధనలు చెబుతున్నాయి. మార్చి 15 నుంచి 23వ తేదీ వరకు దేశీయ విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణించిన 15 మంది ప్రయా ణికు లు కోవిడ్–19 నిబంధనలను పాటించలేదన్న విష యాన్ని అధికారులు గుర్తించారు. వీరిపై 3 నెలల ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉందని డీజీ సీఏ ఉన్నతాధికారులు తెలిపారు. విమానం లోపల ఉన్న సమయంలో మాస్క్ ధరించేందుకు కొందరు నిరాకరిస్తుండగా, మధ్యసీట్లలో కూర్చునే వారు తప్పనిసరిగా పీపీఈ కిట్ ధరించాలనే నిబంధనను మరికొందరు పట్టించుకోవడం లేదని తెలిపారు. -
ఎయిర్‌పోర్ట్‌లకు కరోనా కాటు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నేపథ్యంలో విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇతర సంస్థలతో తీవ్రంగా పోటీపడి మరీ గతేడాది దక్కించుకున్న మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి పనులను ఇప్పుడప్పుడే చేపట్టలేమంటూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ)కు అదానీ గ్రూప్ తెలియజేయడం ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏవియేషన్ రంగంలో అనిశ్చితి నెలకొనడంతో ఈ విమానాశ్రయాలను టేకోవర్ చేయడానికి కనీసం 6 నెలల వ్యవధి ఇవ్వాలని కోరింది. ఏఏఐకు కంపెనీ ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందం ఇలా.. అదానీ గ్రూప్ గతేడాది ఫిబ్రవరిలో ఆరు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం వీటిని 50 ఏళ్ల పాటు అదానీ గ్రూప్ ఆపరేట్ చేయొచ్చు. వీటిలో జైపూర్, త్రివేండ్రం, మరో విమానాశ్రయ ప్రాజెక్టు వివాదంలో ఉండటంతో ఏఏఐతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. లక్నో, మంగళూరు, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కోసం ఫిబ్రవరి 15న ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ముందుగా రూ.1,500 కోట్లు ఏఏఐకి చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి 180 రోజుల్లోగా అసెట్స్‌ను తన స్వాధీనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణ వ్యాపారం కోసం గ్రూప్ ప్రత్యేకంగా అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ పేరిట మరో సంస్థను కూడా ఏర్పాటు చేసింది. అంచనాలు తల్లకిందులు .. లాండింగ్, పార్కింగ్ చార్జీల్లాంటి ప్రధాన వ్యాపారం కన్నా ఇతరత్రా భారీ ఆదాయాలు ఆర్జించవచ్చనే వ్యూహాలతో అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహణ కోసం దూకుడుగా బిడ్డింగ్ చేసింది. ఏరోట్రోపోలిస్, మాల్స్, హోటళ్లు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయాలు రాగలవని భావించింది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో ఏవియేషన్ రంగం వ్యాపార అవకాశాలు గణనీయంగా దెబ్బతినడంతో పునరాలోచనలో పడింది. విమాన ట్రాఫిక్ మళ్లీ పూర్వ స్థాయికి తిరిగి రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని అంచనా వేస్తోంది. దీంతో వేసుకున్న ప్రణాళికలన్నీ తల్లకిందులయ్యాయి. ఒకవేళ అదానీ గ్రూప్ ఇప్పుడు తప్పుకున్న పక్షంలో ఒక్కో ఎయిర్‌పోర్టుకు రూ. 100 కోట్లు చొప్పున కట్టిన గ్యారంటీని వదులుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారంలో ఇరుక్కోవడం కన్నా కాస్తంత ఖర్చయినా తప్పుకోవడమే శ్రేయస్కరం కాగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఫోర్స్ మెజర్ నిబంధనను ఉపయోగించవచ్చని (తమ చేతుల్లో లేని కారణాల వల్ల కాంట్రాక్టును రద్దు చేసుకోవడం) పేర్కొన్నాయి. అయితే, ఫోర్స్ మెజర్ నిబంధనను ఏకపక్షంగా ఉపయోగించే వీలు ఉండకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. దీనికి రెండు పక్షాలు అంగీకరించాల్సి ఉంటుందని వివరించాయి. ఒకవేళ ఎయిర్‌పోర్టుల టేకోవర్‌కు మరింత గడువివ్వాలన్న అదానీ గ్రూప్ ప్రతిపాదనకు ఏఏఐ అంగీకరించని పక్షంలో బిడ్లను రద్దు చేసి, విక్రయ ప్రక్రియను పునఃప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఏదైతేనేం.. ఈ పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం భారీగా తలపెట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియకు విఘాతం కలిగించేవేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరో ఆరు విమానాశ్రయాల విక్రయ ప్రక్రియను ఏఏఐ త్వరలో ప్రారంభిస్తుందంటూ కేంద్రం ఇటీవలే ప్రకటించింది. వారణాసి, అమృత్సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయపూర్, తిరుచ్చి విమానాశ్రయాలు జాబితాలో ఉన్నాయి. -
విమానాశ్రయాల్లో ప్రాంతీయ భాషల్లో అనౌన్స్మెంట్స్
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ఎయిర్‌పోర్టులలో ముందుగా స్థానిక భాషలో ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్లలో పబ్లిక్ అనౌన్స్మెంట్స్ చేయాలంటూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) 2016లోనే తన పరిధిలోని ఏరోడ్రోమ్స్ అన్నింటికి ఇందుకు సంబంధించిన సర్క్యులర్ జారీ చేసింది. తాజాగా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్‌కి కూడా ఈ మేరకు పౌర విమానయాన శాఖ ఆదేశాలు పంపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందకు పైగా ఎయిర్‌పోర్టులు పనిచేస్తున్నాయి. -
1800 సర్వీసులను రద్దు చేసిన స్పైస్‌జెట్
చెన్నై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుత నెలకు సంబంధించి 1,800 సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 31 వరకూ నేపాల్‌లోని ఖాట్మండు, తదితర పలు నగరాలకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో 81 సర్వీసులు సోమవారం(8)నాటివే కావడం గమనార్హం. కళానిధి మారన్‌కు చెందిన సన్ గ్రూప్‌నకు చెందిన కంపెనీ ఇప్పటికే పలు సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బకాయిలకు సంబంధించి రూ. 200 కోట్లమేర బ్యాంక్ గ్యారంటీలు సమర్పించకపోతే బుధవారానికల్లా క్యాష్ అండ్ క్యారీ ప్రాతిపదికన మాత్రమే కార్యకలాపాలను అనుమతించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ) ఇప్పటికే నిర్ణయించింది. కాగా, మరోవైపు ముందస్తు(అడ్వాన్స్) టికెట్ల బుకింగ్‌కు సంబంధించి విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉంది. ఈ బాటలో నెల రోజులకుమించి టికెట్ల బుకింగ్‌ను అనుమతించవద్దంటూ ఇప్పటికే డీజీసీఏ కంపెనీని ఆదేశించింది. ఈ పరిణామాల వల్ల కంపెనీ లెసైన్స్ వెంటనే ప్రమాదంలో పడే అవకాశం లేనప్పటికీ, వివిధ సమస్యలు చుట్టుముట్టవచ్చునని నిపుణులు వ్యాఖ్యానించారు.