త్వరలో విమానాశ్రయాల్లో లై–డిటెక్టర్లు! | Lie-detecting kiosks are coming to an airport near you | Sakshi
Sakshi News home page

త్వరలో విమానాశ్రయాల్లో లై–డిటెక్టర్లు!

Published Fri, Dec 30 2016 8:53 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

త్వరలో విమానాశ్రయాల్లో లై–డిటెక్టర్లు!

త్వరలో విమానాశ్రయాల్లో లై–డిటెక్టర్లు!

లాస్‌ ఏంజిలస్‌: విమానాశ్రయాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలకు ఉపకరించేలా లై–డిటెక్టింగ్‌ సెక్యూరిటీ కియోస్క్‌లు (ప్రయాణికులు అబద్ధాలు ఆడితే కనిపెట్టేవి) త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులను ఇవి ఇంటర్వూ్య చేసి, ఆ సమయంలో వారి శరీర కదలికలు, ప్రవర్తనను గమనించి అబద్ధమాడతున్నారో, నిజం చెబుతున్నారో గుర్తిస్తాయి.

అవతార్‌ (ఆటోమేటెడ్‌ వర్చువల్‌ ఏజెంట్‌ ఫర్‌ ట్రూత్‌ అసెస్‌మెంట్స్‌ ఇన్‌ రియల్‌ టైమ్‌) అనే ఈ కియోస్క్‌ను ప్రస్తుతం కెనడాలో పరీక్షిస్తున్నారు. దీనిని అమెరికాలోని శాన్‌డియాగో స్టేట్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేసే ఆరోన్‌ ఎల్కిన్స్‌ అభివృద్ధి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement