lie detector
-
ఏయ్ నిన్నే..మెషిన్ అరుస్తోంది నిజం చెప్పు
టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్ది మార్కెట్లో కొత్త కొత్త గాడ్జెట్స్ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లోని 'టెల్ అవీవ్ యూనివర్సిటీ' సైంటిస్ట్‌లు 'లైడిటెక్టర్'ను తయారు చేశారు. లైడిటెక్టర్ అంటే 'సూపర్' సినిమాలో' ఉండే హెడ్‌సెట్‌లా కాకుండా ఉల్లిపొరలా ఉండే ఎలక్ట్రోడ్స్ను డిజైన్ చేశారు. నేరస్తులపై లై డిటెక్టర్‌ను ప్రయోగిస్తే 73శాతం ఆక్యురేట్ రిజల్స్ వస్తాయని యూనివర్సిటీ సైంటిస్ట్‌లు చెబుతున్నారు. టెల్ అవీవ్ యూనివర్సిటీ (Tel Aviv University) సైంటిస్ట్‌ల వివరాల ప్రకారం..తాము తయారు చేసిన లైడిటెక్టర్ సాయంతో అబద్దాలు చెప్పే వారిపై రెండు పద్దతుల్లో ప్రయోగిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. మొదటిది అబద్ధం చెప్పేటప్పుడు చెంప కండరాలను యాక్టివేట్ చేసే వారు, రెండవది అబద్ధం చెప్పేటప్పుడు కనుబొమ్మల దగ్గర ఉన్న కండరాలను యాక్టివేట్ చేసేవారు. ఈ రెండు పద్దతుల్లో నిజాల్ని రాబట్టొచ్చని పేర్కొన్నారు. లై డిటెక్టర్ ప్రయోగంలో అబద్దాలు చెప్పడం దాదాపు అసాధ్యం అని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి. పల్స్‌ని ఎలా నియంత్రించాలో తెలిసిన వారు ఈజీగా లై డిటెక్టర్‌ను మోసం చేయొచ్చు. కానీ మేం చేసిన ఈ లైడిటెక్టర్ అబద్ధం చెప్పేటప్పుడు ముఖ కండరాలు పనితీరుపై ఆధారపడి పనిచేస్తుంది. ఇప్పటివరకు ఈ తరహా లైడిటెక్టర్లు లేవు' అని కాలర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అధ్యయనానికి సహకరించిన ప్రొఫెసర్ డినో లెవీ అన్నారు. చదవండి: Good News: కోటికి పైగా ఉద్యోగాలు..ఇక మీదే ఆలస్యం..! -
త్వరలో విమానాశ్రయాల్లో లై–డిటెక్టర్లు!
లాస్ ఏంజిలస్: విమానాశ్రయాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలకు ఉపకరించేలా లై–డిటెక్టింగ్ సెక్యూరిటీ కియోస్క్‌లు (ప్రయాణికులు అబద్ధాలు ఆడితే కనిపెట్టేవి) త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులను ఇవి ఇంటర్వూ్య చేసి, ఆ సమయంలో వారి శరీర కదలికలు, ప్రవర్తనను గమనించి అబద్ధమాడతున్నారో, నిజం చెబుతున్నారో గుర్తిస్తాయి. అవతార్ (ఆటోమేటెడ్ వర్చువల్ ఏజెంట్ ఫర్ ట్రూత్ అసెస్మెంట్స్ ఇన్ రియల్ టైమ్) అనే ఈ కియోస్క్‌ను ప్రస్తుతం కెనడాలో పరీక్షిస్తున్నారు. దీనిని అమెరికాలోని శాన్‌డియాగో స్టేట్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేసే ఆరోన్ ఎల్కిన్స్ అభివృద్ధి చేశారు.