
టెక్నాలజీ అప్‌డేట్ అయ్యే కొద్ది మార్కెట్‌లో కొత్త కొత్త గాడ్జెట్స్ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లోని 'టెల్ అవీవ్ యూనివర్సిటీ' సైంటిస్ట్‌లు 'లైడిటెక్టర్'ను తయారు చేశారు. లైడిటెక్టర్ అంటే 'సూపర్' సినిమాలో' ఉండే హెడ్‌సెట్‌లా కాకుండా ఉల్లిపొరలా ఉండే ఎలక్ట్రోడ్స్‌ను డిజైన్ చేశారు. నేరస్తులపై లై డిటెక్టర్‌ను ప్రయోగిస్తే 73శాతం ఆక్యురేట్ రిజల్స్ వస్తాయని యూనివర్సిటీ సైంటిస్ట్‌లు చెబుతున్నారు.
టెల్ అవీవ్ యూనివర్సిటీ (Tel Aviv University) సైంటిస్ట్‌ల వివరాల ప్రకారం..తాము తయారు చేసిన లైడిటెక్టర్ సాయంతో అబద్దాలు చెప్పే వారిపై రెండు పద్దతుల్లో ప్రయోగిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. మొదటిది అబద్ధం చెప్పేటప్పుడు చెంప కండరాలను యాక్టివేట్ చేసే వారు, రెండవది అబద్ధం చెప్పేటప్పుడు కనుబొమ్మల దగ్గర ఉన్న కండరాలను యాక్టివేట్ చేసేవారు. ఈ రెండు పద్దతుల్లో నిజాల్ని రాబట్టొచ్చని పేర్కొన్నారు.
లై డిటెక్టర్ ప్రయోగంలో అబద్దాలు చెప్పడం దాదాపు అసాధ్యం అని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి. పల్స్‌ని ఎలా నియంత్రించాలో తెలిసిన వారు ఈజీగా లై డిటెక్టర్‌ను మోసం చేయొచ్చు. కానీ మేం చేసిన ఈ లైడిటెక్టర్ అబద్ధం చెప్పేటప్పుడు ముఖ కండరాలు పనితీరుపై ఆధారపడి పనిచేస్తుంది. ఇప్పటివరకు ఈ తరహా లైడిటెక్టర్లు లేవు' అని కాలర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అధ్యయనానికి సహకరించిన ప్రొఫెసర్ డినో లెవీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment