lie detector tests
-
ఏయ్ నిన్నే..మెషిన్ అరుస్తోంది నిజం చెప్పు
టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్ది మార్కెట్లో కొత్త కొత్త గాడ్జెట్స్ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లోని 'టెల్ అవీవ్ యూనివర్సిటీ' సైంటిస్ట్‌లు 'లైడిటెక్టర్'ను తయారు చేశారు. లైడిటెక్టర్ అంటే 'సూపర్' సినిమాలో' ఉండే హెడ్‌సెట్‌లా కాకుండా ఉల్లిపొరలా ఉండే ఎలక్ట్రోడ్స్ను డిజైన్ చేశారు. నేరస్తులపై లై డిటెక్టర్‌ను ప్రయోగిస్తే 73శాతం ఆక్యురేట్ రిజల్స్ వస్తాయని యూనివర్సిటీ సైంటిస్ట్‌లు చెబుతున్నారు. టెల్ అవీవ్ యూనివర్సిటీ (Tel Aviv University) సైంటిస్ట్‌ల వివరాల ప్రకారం..తాము తయారు చేసిన లైడిటెక్టర్ సాయంతో అబద్దాలు చెప్పే వారిపై రెండు పద్దతుల్లో ప్రయోగిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. మొదటిది అబద్ధం చెప్పేటప్పుడు చెంప కండరాలను యాక్టివేట్ చేసే వారు, రెండవది అబద్ధం చెప్పేటప్పుడు కనుబొమ్మల దగ్గర ఉన్న కండరాలను యాక్టివేట్ చేసేవారు. ఈ రెండు పద్దతుల్లో నిజాల్ని రాబట్టొచ్చని పేర్కొన్నారు. లై డిటెక్టర్ ప్రయోగంలో అబద్దాలు చెప్పడం దాదాపు అసాధ్యం అని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి. పల్స్‌ని ఎలా నియంత్రించాలో తెలిసిన వారు ఈజీగా లై డిటెక్టర్‌ను మోసం చేయొచ్చు. కానీ మేం చేసిన ఈ లైడిటెక్టర్ అబద్ధం చెప్పేటప్పుడు ముఖ కండరాలు పనితీరుపై ఆధారపడి పనిచేస్తుంది. ఇప్పటివరకు ఈ తరహా లైడిటెక్టర్లు లేవు' అని కాలర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అధ్యయనానికి సహకరించిన ప్రొఫెసర్ డినో లెవీ అన్నారు. చదవండి: Good News: కోటికి పైగా ఉద్యోగాలు..ఇక మీదే ఆలస్యం..! -
అనుమానితులకు.. లై డిటెక్టర్ టెస్టులు
న్యూఢిల్లీ: గత అక్టోబర్‌లో అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ విషయంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి స్పందించింది. 9 మంది అనుమానితులకు లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 23కు వాయిదా వేసింది. విద్యార్థి ఎన్నికలకు సంబంధించి అహ్మద్ ఉంటున్న గది వద్దకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలు అతడితో గొడవకు దిగారని, దాడి చేశారని అప్పటి నుంచి అహ్మద్ కనిపించకుండా పోయాడని, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు పోలీసులు కనుక్కోలేకపోయారని అతడి తల్లిదండ్రులు హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. అతడు కనిపించకుండాపోయి రెండు నెలలు గడిచిపోతుంది. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తాన్ని స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేయించాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ వినోద్ గోయల్ లతో కూడిన ధర్మాసనం ఇంతకు ముందే పోలీసులను ఆదేశించింది. వర్సిటీలో అనువణువు గాలించి ఏదో ఒక ఆధారాన్నయినా సంపాదించాలని సూచించింది. దీంతో నజీబ్ అహ్మద్ తల్లి దండ్రుల సమక్షంలో రెండు రోజులుగా 560 మంది అధికారులు యూనివర్సిటీ మొత్తాన్ని జల్లెడపడుతున్నా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. -
సునంద కేసులో ముగ్గురికి 'లైడిటెక్టర్' పరీక్షలు
-
సునంద కేసులో ఆ ముగ్గురికి 'లై డిటెక్టర్' పరీక్షలు
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తీసుకోనుంది. హత్య జరిగిన రోజు.. అంతకు ముందు చోటుచేసుకున్న పరిణామాలను శోధిస్తోన్న ఢిల్లీ పోలీసులు.. ముగ్గురు సాక్షులకు లై డిటెక్టర్ (సత్యశోధన) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోర్టుకు విన్నవించారు. శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ దావన్‌లు దర్యాప్తునకు సహకరించడంలేదని, జవాబులు తెలినప్పటికీ కీలకమైన ప్రశ్నలు కొన్నింటికి సమాధానాలు దాటవేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాల్సిఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. సదరు సాక్షులు ముగ్గురు మే 20న కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజే వారిని పోలీసు కస్టడీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. -
మంత్రులూ.. లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?
ఆంధ్రప్రదేశ్ మంత్రులు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాజధాని భూసేకరణకు రైతులు అంగీకారం తెలిపారంటున్న మంత్రుల ప్రకటనలు వాస్తవ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఇదే విషయంపై మంత్రులకు లై డిటెక్టర్ పరీక్షలు చేయిద్దామని ఆయన అన్నారు. వాళ్లతో పాటు రైతులకు, తమకు కూడా ఈ పరీక్షలు చేయించాలని, అప్పుడు ఎవరు నిజాలు మాట్లాడుతున్నారో.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తేలిపోతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.