హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు మరింత పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం సెపె్టంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.457 కోట్ల నికర నష్టం ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.334 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవరు రూ.1,904 కోట్ల నుంచి రూ.2,018 కోట్లకు చేరింది. ఎయిర్‌పోర్టుల విభాగం ఆదాయం రూ.1,315 కోట్ల నుంచి రూ.1,494 కోట్లకు పెరిగింది.
విద్యుత్ విభాగం టర్నోవరు రూ.178 కోట్ల నుంచి రూ.167 కోట్లకు చేరింది. సెపె్టంబరు క్వార్టరులో ఢిల్లీ విమానాశ్రయంలో ప్యాసింజర్ ట్రాఫిక్ 1.73 కోట్లు నమోదు చేసింది. జూన్ త్రైమాసికంతో పోలిస్తే 10% వృద్ధి చెందింది. 2019–20 జూలై–సెపె్టంబరు కాలంలో ఈ విమానాశ్రయం రూ.135 కోట్ల లాభం ఆర్జించింది. 2018–19 క్యూ2లో ఇది రూ.88 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంతో పోలిస్తే ఈ సెప్టెంబరు క్వార్టరులో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 3 శాతం వృద్ధితో 54 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ ఎయిర్‌పోర్ట్ రూ.217 కోట్ల లాభం ఆర్జించింది.
జీఎంఆర్‌కు పెరిగిన నష్టాలు
Published Sat, Nov 16 2019 5:26 AM | Last Updated on Sat, Nov 16 2019 5:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment