ఎయిర్పోర్టుల్లో భారీగా బంగారం పట్టివేత
ఎయిర్పోర్టుల్లో భారీగా బంగారం పట్టివేత
Published Sat, Dec 10 2016 7:19 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
నోట్ల రద్దు.. అనంతరం బంగారంపై ఆంక్షలు.. దీంతో దేశవ్యాప్తంగా కేజీలకు కేజీల బంగారం గుట్టురట్టవుతోంది. కర్ణాటకలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో సీక్రెట్ బాత్రూమ్లో 32 కేజీల బంగారాన్ని ఐటీ శాఖ పట్టుకున్న కొద్దిసేపటికే చెన్నై, రాంచీ ఎయిర్పోర్టులోనూ భారీగా బంగారం బయటపడింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) తనిఖీల్లో చెన్నై ఎయిర్పోర్టులో 28 కేజీల బంగారం, రాంచీ ఎయిర్పోర్టులో 4 కేజీల బంగారం పట్టుబడింది. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ బలగాలు, వాటిని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు తరలించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం బంగారంపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, అక్రమ సంపాదనల వెలికితీతలపై ఎన్ఫోర్స్మెంట్, ఐటీ శాఖ ద్వారా రైడ్స్ నిర్వహిస్తోంది.
ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా గుట్టలుగుట్టలుగా బంగారం బయటికి వస్తోంది. మొన్న చెన్నైలో ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో 100 కిలోల బంగారం వరకు బయటపడింది. అంతేకాక విశాఖ ఎయిర్పోర్టులోనూ భారీ ఎత్తున్న బంగారం పట్టుబడింది. మగ్గురు వ్యక్తుల నుంచి కస్టమర్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు1.966 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ దాడులు ముమ్మరంగా సాగుతుండటంతో ప్రస్తుతం బంగారాన్ని విమానాల ద్వారా ఇతర ప్రాంతాలను తరలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement