అణు విద్యుత్ కేంద్రంలో జవాన్ వీరంగం
పళ్లిపట్టు: విచక్షణ కోల్పోయిన ఓ జవాన్ కాల్పుల్లో ముగ్గురు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్రగాయూలపాలయ్యూరు. ఈ సంఘటన బుధవారం ఉదయం కాంచీపురం జిల్లా కల్పాక్కంలోని అణు విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లా కల్పాక్కంలోని అణువిద్యుత్ కేంద్రం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్‌ఎప్) కట్టుబాటులో ఉంది. బుధవారం వేకువ జామున జవాన్లు రోల్‌కాల్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీఐఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ విజయప్రతాప్‌సింగ్ బ్యారక్స్‌లో నిద్రిస్తున్న తన పై అధికారి రాజస్థాన్‌కు చెందిన మోహన్ సింగ్ (42)ను చేతిలో ఉన్న 9 ఎమ్‌ఎమ్ గన్‌తో కాల్పులు జరిపాడు.
దీంతో అక్కడ రోల్‌కాల్ నిర్వహిస్తున్న జవాన్లు ఆందోళనతో సంఘటన స్థలానికి పరుగులు తీశారు. జవానును సమీపిస్తున్న తరుణంలో విజయప్రతాప్ సింగ్ వారిపైనా కాల్పులు జరిపాడు. దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్ గణేశన్(58), హెడ్ కానిస్టేబుల్ సుబ్బురాజ్(54) కూడా మృతి చెందగా, ప్రతాప్‌సింగ్, గోవర్ధన ప్రశాం త్ తదితరులు గాయపడ్డారు. అయినా పైరిం గ్‌ను విజయ్‌ప్రతాప్‌సింగ్ నిలపకపోవడంతో తక్కిన జవాన్లు చాకచక్యంగా ప్రతాప్‌సింగ్‌ను పట్టుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. గాయూలపాలైన జవాన్లను వెంటనే చెన్నై కేళంబాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో గోవర్ధన ప్రతాప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన జవాన్ల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పరుగులు తీసిన డీఐజీ, ఎస్పీ
డీఐజీ సత్యమూర్తి, కాంచీపురం ఎస్పీ విజయకుమార్ తదితరులు సంఘటన ప్రాంతం చేరుకుని కాల్పుల సంఘటన పట్ల విచారణ జరిపా రు. ఇందులో జవాన్ల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధమే ఫైరింగ్‌కు దారితీసిందని ప్రాథమికంగా తెలిసింది. కాల్పులు జరిపి ముగ్గురు మృతికి కారకుడైన విజయప్రతాప్‌సింగ్‌ను కల్పాక్కం పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.