కిలాడీ లేడీలు
కిలాడీ లేడీలు
Published Tue, Dec 27 2016 5:54 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
న్యూఢిల్లీ: నేషనల్ కేపిటల్ రీజియన్ లో కిలాడీ లేడీలు పెరిగిపోతున్నారు. ఢిల్లీ మెట్రో రైళ్లలో జేబులు కత్తిరించేస్తూ పోలీసులకు పట్టుబడిన వారిలో 91శాతం మహిళలే ఉన్నారు. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) పోలీసులు ఈ ఏడాది ఢిల్లీ మెట్రో స్టేషన్లలో నిర్వహించిన 100కు పైగా ఆపరేషన్లలో 438 మంది మహిళలు జేబులు కత్తిరించేస్తూ పట్టుబడగా.. కేవలం 41 మంది పురుషులు పిక్ పాకెటింగ్ చేస్తూ దొరికిపోయారు.
గత కొద్ది సంత్సారాలుగా జేబు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని సీఐఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. పిల్లవాడిని చంకలో పెట్టుకునో లేక గుంపుగా ఉంటూనో మహిళలు ప్రయాణీకుల పర్సులు కాజేస్తున్నట్లు చెప్పారు. వీరిని పట్టుకోవడానికి సీఐఎస్‌ఎఫ్ పోలీసులు సాధారణ దుస్తుల్లో రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
Advertisement