నడుస్తున్న మెట్రో రైలు ముందు దూకి సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్(30) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పటేల్ చౌక్ స్టేషన్ వద్ద మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్‌గావ్‌లోని హుడా సెంటర్ నుంచి బయల్దేరిన రైలు పటేల్‌చౌక్ స్టేషన్‌ను దాటుతున్న సమయంలో రెండో ప్లాట్‌ఫాంపై నుంచి దూకటంతో ఈ ఘటన చోటు చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్‌లో పనిచేస్తున్న సంజయ్ ప్రసాద్‌గా గుర్తించినట్లు తూర్పు ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు.
మెట్రో రైలుకిందపడి కానిస్టేబుల్ ఆత్మహత్య
Published Thu, Aug 4 2016 8:03 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement