ఆరో అంతస్తునుంచి దూకి ఐఏఎస్‌ కుమారుడు ఆత్మహత్య | 15 Year Old Son Of IAS Officer Jumps From 6th Floor In Delhi Dead | Sakshi
Sakshi News home page

Suicide: ఆరో అంతస్తునుంచి దూకి ఐఏఎస్‌ కుమారుడు ఆత్మహత్య

Published Sun, Dec 26 2021 8:01 PM | Last Updated on Sun, Dec 26 2021 8:01 PM

15 Year Old Son Of IAS Officer Jumps From 6th Floor In Delhi Dead - sakshi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

IAS Officer son committed suicide న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్‌ అధికారి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువకుడు తల్లిదండ్రులులేని సమయంలో 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగువారు హుటాహుటీనా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన యువకుడు చికిత్స సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 

 ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి 8 గంటల 30 నిముషాలకు చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ఫైల్‌ చేసి విచారణ చేపట్టారు. మృతి చెందిన బాలుడు (15) మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, గత సెప్టెంబర్‌ నుంచి ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో తల్లిదండ్రులు ఎవ్వరూ ఇంట్లో లేరని, ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉందని, ఈ రోజుల్లో ప్రతి చిన్న కారణానికి యువత ప్రాణాలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా పోలీసధికారి ఒకరు తెలిపారు.

చదవండి: New Year 2022: న్యూ ఇయర్‌ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement