
సాక్షి, చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తమిళనాడు క్యాంపస్‌లో విస్పోటనం జరిగిందంటూ దుష్ప్రచారం జరగడంపై సంబంధిత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇస్రోపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని క్యాంపస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గత జూన్ 23న తిరునెల్వేవి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో క్యాంపస్‌లో చిన్న మంట రాజుకుని పొగలు వ్యాపించాయని ప్రచారం జరిగింది. దీనిపై యాంటీ నక్సల్ టీమ్, సీఐఎస్ఎఫ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. క్యాంపస్‌కు 20 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోగా.. క్యాంపస్‌లో ప్రమాదం జరిగిందంటూ ప్రచారం చేశారని విచారణాధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు.