గొడవపడి ఇన్స్పెక్టర్ను కాల్చేసిన సీఐఎస్ఎఫ్ జవాన్ | CISF jawan kills senior officer | Sakshi
Sakshi News home page

గొడవపడి ఇన్స్పెక్టర్ను కాల్చేసిన సీఐఎస్ఎఫ్ జవాన్

Published Sun, Oct 20 2013 12:11 PM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

CISF jawan kills senior officer

కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) జవాన్ తన పైస్థాయి అధికారితో గొడవపడి ఆవేశంతో అతణ్ని తుపాకితో కాల్చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన కోల్కతా పోర్టు ట్రస్టు వద్ద సీఐఎస్ఎఫ్ శిబిరంలో ఆదివారం జరిగింది.

ఇన్స్పెక్టర్ గురుపాద షీత్, ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జవాన్ తన రైఫిల్తో మూడు రౌండ్లు కాల్పులు జరిపడంతో గురుపాద అక్కడికక్కడే మరణించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కోల్కతా డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిసాకుమార్ తెలిపారు. అతన్ని కోర్టులో హాజరు పరచనున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement