
ట్రాలీపై మందుల పెట్టెలు
నడపలేని స్థితిలో ఉన్న రోగుల కోసం ఆస్పత్రుల్లో వీల్‌చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉంటాయి. కేజీహెచ్‌లోనూ అవి ఉన్నాయి.. కానీ వాటిని రోగుల కోసం కాకుండా మందులు, బెడ్‌షీట్లు, ఇతరత్రా సామగ్రి తరలించడానికి వినియోగిస్తున్నారు. రోగులను మాత్రం వారి సహాయకులు చేతులపై మోసుకొని, ఎత్తుకొని తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): సర్కారీ ఆసుపత్రుల్లో ట్రాలీలు, వీల్‌చైర్లు, స్ట్రెట్చర్ల కొరత పట్టిపీడిస్తోంది. కేజీహెచ్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. అరకొరగా ఉన్న వాటిని సిబ్బంది మందులు, గోనె సంచులు, చెత్తబుట్టలు, ఆక్సిజన్ సిలిండర్లు తరలించేందుకు వినియోగిస్తున్నారు. దీంతో అత్యవసర సమయంలో రోగులను వారి వారి బంధువులు చేతులమీద, వీపుపై ఎక్కించుకుని తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు అవసరమైన పరికరాలు లేకపోవడంతో రోగుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. వార్డు నుంచి లేదా ఓపీ నుంచి నడవలేని వ్యక్తిని ప్రత్యేక వైద్య పరీక్షల నిమిత్తం ఎక్స్‌రే, స్కానింగ్‌లకు తీసుకువెళ్లేందుకు రోగి సహాయకులు నానాపాట్లు పడుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని రోగులకు ముందుగా సహాయం అందిలే చూడాలని పలువురు కోరుతున్నారు.

ఎక్స్‌రే, స్కానింగ్‌లకు రోగులను చేతులమీద, వీపుపై తీసుకు వెళ్తున్న బంధువులు

సిబ్బంది కొరతతో రోగిని ట్రాలీపై వార్డుకు తీసుకువెళ్తున్న బంధువులు

వీల్‌చైర్ లేకపోవడంతో నిండు గర్భిణిని నడిపిస్తూ లేబర్‌రూంకు తీసుకువెళ్తున్న బంధువులు


ట్రాలీపై మందుల పెట్టెలు, గోనె మూటలు



వీల్ ఛైర్‌లో మినీ ఆక్సిజన్ సిలిండర్లు

వీల్ ఛైర్‌లో చెత్తబుట్ట

Comments
Please login to add a commentAdd a comment