సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'సీతా కల్యాణ వైభోగమే'. ఈ చిత్రాన్ని సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.
హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘కొత్త హీరోని నమ్మి సినిమా తీయడం అంత ఈజీ కాదు. మా మీద నమ్మకముంచిన నిర్మాత రాచాల యుగంధర్‌కు థాంక్స్. గరీమ చౌహాన్ చక్కగా నటించారు. మా దర్శకుడు సతీష్ మంచి కమర్షియల్ సినిమా తీశారు. గగన్ విహారి చాలా వైల్డ్‌గా నటించారు. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
గరీమ చౌహాన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకుల ప్రేమకు థాంక్స్. నాకు ఇదే మొదటి చిత్రం. ఇక్కడ అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమా ఇది. మా మూవీని చూసి అందరూ ఆదరించండి’ అని అన్నారు.
దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ఊరికి ఉత్తరాన. ఆ చిత్రానికి కూడా యుగంధర్ సహ నిర్మాత. మళ్లీ ఆయనతోనే రెండో సినిమాను తీయడం ఆనందంగా ఉంది. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మళ్లీ మన విలువలు, సంప్రదాయాన్ని అందరికీ చూపించాలానే ఉద్దేశంతో ఈ సినిమాను తీశాను. మర్చిపోతోన్న విలువల్ని అందరికీ గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుంది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment