పాన్ ఇండియా మూవీగా వస్తోన్న రికార్డ్ బ్రేక్..! | Tollywood Movie Record Break Lyrical Song Released | Sakshi
Sakshi News home page

Record Break: పాన్ ఇండియా మూవీగా రికార్డ్ బ్రేక్..!

Published Fri, Mar 1 2024 6:10 PM | Last Updated on Fri, Mar 1 2024 6:10 PM

Tollywood Movie Record Break Lyrical Song Released - Sakshi

నిహార్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ విడుదల చేశారు మేకర్స్. మళ్లీ పుట్టి వచ్చినవా అంటూ సాగే పాట అభిమానులను అలరిస్తోంది. 

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..'ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. అతి త్వరలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాం. ప్రేక్షకులందరికీ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో 8 భాషల్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ కీలత పాత్రల్లో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement