Seetha Kalyana Vaibhogame
-
సీత కళ్యాణ వైభోగమే మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
'సీతా కళ్యాణ వైభోగమే' ట్రైలర్ వచ్చేసింది!
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం సీతా కళ్యాణ వైభోగమే. ఈ మూవీని సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు.హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓ మై ఫ్రెండ్ టైంలోనే సతీష్‌తో పరిచయం. ఈ మూవీ ఐడియాను ఏడాదిన్నర క్రితమే చెప్పాడు. సుమన్ ఫస్ట్ ఫిల్మ్, సతీష్ రెండో చిత్రానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి అని అన్నారు.దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్ అందరికీ నచ్చింది. సుమన్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. చరణ్ అర్జున్ మంచి పాటలు ఇచ్చారు. నిర్మాత యుగంధర్ సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉంది. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశా. నీరూస్ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రం కోసం యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు’ అని అన్నారు. -
‘సీతా కళ్యాణ వైభోగమే’ పెద్ద విజయం సాధించాలి: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
సుమన్ తేజ్, గరీమా చౌహాన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘యుగంధర్ నిర్మించిన ‘సీతా కల్యాణ వైభోగమే’ టైటిల్ చూస్తే, ఫీల్ గుడ్ మూవీలా కనిపిస్తోంది. మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.‘‘కొన్ని వందల స్క్రిప్ట్స్ విన్నాం. ఫైనల్‌గా ఈ సినిమాతో జర్నీ మొదలైంది’’ అన్నారు సుమన్ తేజ్. ‘‘సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు మనకు పూర్తిగా తెలియవు. ఈ చిత్రంలో నాలాంటి రావణ పాత్రతో సీత ఎలాంటి కష్టాలు పడిందో చూపించారు. సీత క్యారెక్టర్లో గరీమ చక్కగా నటించారు’’ అన్నారు గగన్ విహారి. ‘‘మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఎమోషనల్ జర్నీగా చూపించాం’’ అన్నారు సతీష్ పరమవేద. ‘‘ఏ మాత్రం పారితోషికం ఆశించకుండా పని చేసిన సంగీతదర్శకుడు చరణ్ అర్జున్‌కు థ్యాంక్స్’’ అన్నారు రాచాల యుగంధర్. -
సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్.. రిలీజ్ ఎప్పుడంటే?
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'సీతా కల్యాణ వైభోగమే'. ఈ చిత్రాన్ని సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘కొత్త హీరోని నమ్మి సినిమా తీయడం అంత ఈజీ కాదు. మా మీద నమ్మకముంచిన నిర్మాత రాచాల యుగంధర్‌కు థాంక్స్. గరీమ చౌహాన్ చక్కగా నటించారు. మా దర్శకుడు సతీష్ మంచి కమర్షియల్ సినిమా తీశారు. గగన్ విహారి చాలా వైల్డ్‌గా నటించారు. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. గరీమ చౌహాన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకుల ప్రేమకు థాంక్స్. నాకు ఇదే మొదటి చిత్రం. ఇక్కడ అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమా ఇది. మా మూవీని చూసి అందరూ ఆదరించండి’ అని అన్నారు. దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ఊరికి ఉత్తరాన. ఆ చిత్రానికి కూడా యుగంధర్ సహ నిర్మాత. మళ్లీ ఆయనతోనే రెండో సినిమాను తీయడం ఆనందంగా ఉంది. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మళ్లీ మన విలువలు, సంప్రదాయాన్ని అందరికీ చూపించాలానే ఉద్దేశంతో ఈ సినిమాను తీశాను. మర్చిపోతోన్న విలువల్ని అందరికీ గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుంది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతమందించారు. -
ఆకట్టుకుంటున్న ‘సీతా కళ్యాణ వైభోగమే’ ఫస్ట్ లుక్
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం సీతా కల్యాణ వైభోగమే. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రం రాబోతోంది. గోవాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ నేతృత్వంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఈ చిత్రంలోని ఒక పాటను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే..లవ్ అండ్ యాక్షన్ మూవీని చూడబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 100 మంది ఫైటర్లతో చిత్రీకరించిన భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. గగన్ విహారి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, కెమెరామెన్ పరుశురామ్, ఎడిటర్ డి. వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలకి విజయ్ పనిచేస్తున్నారు.