
సుమన్ తేజ్, గరీమా చౌహాన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘యుగంధర్ నిర్మించిన ‘సీతా కల్యాణ వైభోగమే’ టైటిల్ చూస్తే, ఫీల్ గుడ్ మూవీలా కనిపిస్తోంది. మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.
‘‘కొన్ని వందల స్క్రిప్ట్స్ విన్నాం. ఫైనల్‌గా ఈ సినిమాతో జర్నీ మొదలైంది’’ అన్నారు సుమన్ తేజ్. ‘‘సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు మనకు పూర్తిగా తెలియవు. ఈ చిత్రంలో నాలాంటి రావణ పాత్రతో సీత ఎలాంటి కష్టాలు పడిందో చూపించారు. సీత క్యారెక్టర్‌లో గరీమ చక్కగా నటించారు’’ అన్నారు గగన్ విహారి. ‘‘మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఎమోషనల్ జర్నీగా చూపించాం’’ అన్నారు సతీష్ పరమవేద. ‘‘ఏ మాత్రం పారితోషికం ఆశించకుండా పని చేసిన సంగీతదర్శకుడు చరణ్ అర్జున్‌కు థ్యాంక్స్’’ అన్నారు రాచాల యుగంధర్.
Comments
Please login to add a commentAdd a comment