Viral Photos: Jordar Sujatha, Rocking Rakesh Haldi Function - Sakshi
Sakshi News home page

Rocking Rakesh: ఈ ఆనందం చెప్పలేనిది, రాయలేనిది.. రాకింగ్‌ రాకేశ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sat, Feb 25 2023 4:49 PM | Last Updated on Sat, Feb 25 2023 5:10 PM

Jordar Sujatha, Rocking Rakesh Haldi Function Photos Viral - Sakshi

జబర్దస్త్‌ కమెడియన్లు రాకింగ్‌ రాకేశ్‌, జోర్దార్‌ సుజాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం జరుపుకోగా తాజాగా పెళ్లిపీటలెక్కారు. బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తమ హల్దీ వేడుకల ఫోటోలను నూతన వధూవరులిద్దరూ అభిమానులతో పంచుకున్నారు.

'మీ అందరి ఆశీర్వాదాలతో ఒక్కటయ్యాం. ఈ ఆనందం చెప్పలేనిది, రాయలేనిది' అంటూ ఫోటోలు షేర్‌ చేశారు. తమకు శుభాకాంక్షలు చెప్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం వీరి హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ హల్దీ థీమ్‌లో రాకేశ్‌, సుజాత ఇద్దరూ పసుపు రంగు బట్టలు ధరించగా వెరైటీ పోజులతో ఫోటోలు క్లిక్‌మనిపించారు.

చదవండి: కష్టాలతో సావాసం.. ఫైమా సొంతింటి కల సాకారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement