'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్! | Jabardasth Comedian Rocking Rakesh KCR Movie Poster | Sakshi
Sakshi News home page

KCR Movie: 'కేసీఆర్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆ కమెడియన్!

Published Fri, Oct 13 2023 7:57 PM | Last Updated on Fri, Oct 13 2023 8:17 PM

 Jabardasth Comedian Rocking Rakesh KCR Movie Poster - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకాస్త టైం ఉంది కానీ తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైపోయింది. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించేశారు. కొన్నిరోజుల్లో నామినేషన్స్, ఎన్నికలు, కౌంటింగ్ అని హడావుడి మాములుగా ఉండదు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ కమెడియన్ తన కొత్త మూవీ టైటిల్ ప్రకటించాడు. కాకపోతే దానికి 'కేసీఆర్' అని పేరు పెట్టడం ఆసక్తికరంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా)

ఈ సినిమా సంగతేంటి?
మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన రాకేశ్.. ఆ తర్వాత కొన్నాళ్లకు 'జబర్దస్త్' కామెడీ షోలోకి వచ్చాడు. అలా కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత రాకింగ్ రాకేశ్ అయ్యాడు. మొన్నీ మధ్య హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు ఆ చిత్రానికే 'కేసీఆర్' అనే టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు.

టైటిల్ మాత్రమేనా?
అయితే ఈ సినిమా పోస్టర్‌లో కేసీఆర్ ఫేస్ రివీల్ చేయలేదు. కానీ లుక్ చూస్తుంటే ఆయనదే అనిపిస్తుంది. అలానే కేసీఆర్ అంటే 'కేశవ్ చంద్ర రమావత్' అని తెలుస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలంగాణ బ్యాక్‌డ్రాప్ అనిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి రాజకీయాలతో సంబంధం ఉందా? లేదంటే హైప్ కోసమే ఆ పేరు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో అమర్‌కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement