శ్రుతి అంటే ఎవరూ గుర్తుపట్టరు కావచ్చు కానీ, జోర్దార్ సుజాత అంటే ఇట్టే గుర్తుపడతారు. పూర్తిగా పల్లెటూరులోనే పెరిగిన ఆమె సర్కార్ బడిలో పదో తరగతి వరకు చదివింది. పై చదువులు పూర్తయ్యాక ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో జాబ్ చేసింది. తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రామ్ వస్తుందంటే ఓ సారి ప్రయత్నిద్దామని రాయి వేసి చూసింది. కానీ ఆమె మాట్లాడే తీరు నచ్చడంతో ఎంపిక చేసుకున్నారు. అలా తీన్మార్ వార్తలు కార్యక్రమంలో సుజాతగా అందరికీ దగ్గరయ్యింది. ఆ తర్వాత వేరే ఛానల్‌లోనూ యాంకర్‌గా రాణిస్తోంది. కానీ పాపులారిటీ వచ్చిన సమయంలోనే కన్నీళ్లు సైతం గడ్డ కట్టుకుపోయేటన్ని బాధలను చూసానంటోంది. అన్నింటినీ దాటే ఇక్కడి వరకు వచ్చానని చెప్తోంది. మంచిగ అనిపిస్తే దిల్‌దార్‌గా మాట్లాడతా, కోపమొస్తే బొక్కలిరగ్గొడతా అంటోంది. వచ్చీరాగానే నాగార్జునను బిట్టు అని పలకరిస్తూ జోర్దార్‌గా మాట్లాడింది. తన ముచ్చట్లతో నాగ్‌ను బుట్టలో వేసుకున్న ఆమెకు నాగ్ బహుమతి కూడా ఇచ్చారు. మరి ఆమె ఇంట్లో ఇలానే తన యాసతో అలరిస్తుందా? లేదా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment