
బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో ఎవరూ పెద్దగా పరిచయం లేని ముఖాలే కాబట్టి వారి పర్‌ఫార్మెన్స్ ఆధారంగా ఓట్లేద్దామని చాలామంది ప్రేక్షకులు డిసైడ్ అయి ఉన్నారు. ఈ క్రమంలో గతవారం జరిగిన ఫిజికల్ టాస్క్‌తో అభిజిత్ మహానాయకుడిగా మారిపోయాడు. ఆ టాస్క్‌లో ప్రత్యర్థి టీమ్‌కు మాత్రం అభి విలన్‌గా మారిపోయాడు. టాస్క్ పూర్తై రోజులు గడుస్తున్నా మనుషుల టీమ్ అందులో నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు. నిన్నటి నామినేషన్‌లోనూ మెహబూబ్ టాస్క్‌లోని సాకులను చూపుతూ అభిజిత్‌ను నామినేట్ చేశాడు. కానీ అదే టాస్కును అడ్డం పెట్టుకుని హారిక.. మెహబూబ్‌ను, అఖిల్.. హారికను నామినేట్ చేశారు. దీంతో వాళ్లింకా టాస్కును మనసులోనే పెట్టుకున్నారని స్పష్టమవుతోంది. (అభిజిత్‌లో ధోనీని చూశా: యాంకర్ రవి)
ఈ క్రమంలో నేడు మరోసారి టాస్క్ గురించి చర్చ జరగనున్నట్లు తాజా ప్రోమో నిరూపిస్తోంది. అందులో భాగంగా కూల్ అభికి, హైపర్ సోహైల్‌కు మాటల యుద్ధం జరగనున్నట్లు కనిపిస్తోంది. ఆ టాస్కులో జరిగిన వాటి గురించి మాట్లాడుతూ 'నీకు దమ్ము లేదు, అందుకే రాలేదు' అని సోహైల్ అభి ముఖం పట్టుకుని అనేశాడు. 'కండలుంటే నువ్వు మగాడివి అయిపోతావా?' అని అభి కూడా గట్టిగానే కౌంటర్ వేశాడు. దీంతో 'ఫిజికల్ టాస్క్ ఇవ్వకండి, పాపం.. అభి చాలా వీక్, లేదంటే మళ్లీ అమ్మాయిలను పెట్టి ఆడతాడ'ని సోహైల్ బిగ్‌బాస్‌కే సలహా ఇచ్చాడు.
కాగా ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అభి కరెక్ట్ అని, సోహైల్ అనవసరంగా వాగుతున్నాడని అంటున్నారు. మరికొందరేమో మెహబూబ్ కావాలనే సోహైల్‌ను అభి మీదకు ఉసిగొల్పుతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఈ గొడవ ఎవరు ప్రారంభించారు? ఈ లొల్లి ఎక్కడివరకూ వెళ్లిందనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. (బిగ్‌బాస్: ఈ వారం ఎవరు ఇళ్లు వదిలి వెళ్లనున్నారు!)