కంటెస్టెంట్లు కలిసి ఉండాలన్నా, గొడవలు పెట్టుకోవాలన్నా అదంతా బిగ్‌బాస్ చేతిలో ఉంటుంది. అఖిల్-అభిజిత్ విషయంలో ఇది తేటతెల్లమవుతోంది. బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభమైన తొలినాళ్లలో ఏ సమస్యా లేకపోయినా అఖిల్, అభిజిత్ గొడవలు పడేవారు. కేవలం మోనాల్ కోసం కొట్టుకు చచ్చేవారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరూ ఆమెను వదిలేసి స్నేహం గీతం పాడుకుంటూ కలిసిపోయారు. ఇంతలో నామినేషన్ పెంట పెట్టి బిగ్‌బాస్ అఖిల్, అభి మధ్య నిప్పు రాజేసే ప్రయత్నం చేశాడు. తర్వాత సీక్రెట్ రూమ్ ట్విస్టుతో ఆ నిప్పు అగ్ని పర్వతంలా మారగా.. రీఎంట్రీతో అఖిల్ దాన్ని బద్ధలు చేస్తూ ఫైర్ అయ్యాడు. నామినేషన్‌లోనూ.. మటన్ షాపు ఓనర్ మేకకు గడ్డి చూపించాడు. మేక లోపలికి వెళ్లిపోయింది.. తర్వాత ఏమైంది అంటూ అభి తన గురించి వెనకాల మాట్లాడిన మాటలను ప్రస్తావిచాడు. ఆ మేక ఇప్పుడు పులై వచ్చిందని చెప్తూ అతడిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్లారు. (చదవండి: ఆఫ్ట్రాల్ ఓ బచ్చాగానివి, పక్కకు పో: అభి ఫైర్)
కానీ మొన్న అఖిల్ అమ్మ హౌస్‌లోకి వెళ్లి అభిజిత్, నీ బ్రదర్‌ను బాగా చూసుకో అని అఖిల్ గురించి చెప్పుకొచ్చింది. అటు అభి అమ్మ కూడా ఏం పర్లేదు కొట్టుకోండి అని సలహా ఇచ్చింది. ఈ ఒక్క ఎపిసోడ్‌తో బద్ధ శత్రువుల్లా మారిన అఖిల్, అభిజిత్ సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయారు. కానీ ఇది బిగ్‌బాస్‌కు బొత్తిగా నచ్చనట్లు కనిపిస్తోంది. దీంతో నాగార్జున నేడు మరోసారి మేక గొడవను లేవనెత్తారు. దీనిపై అభి స్పందిస్తూ.. తను అన్నదాంట్లో తప్పేముందని అడిగాడు. అఖిల్ ముందు చెప్పమన్నా చెప్తానని స్పష్టం చేశాడు. దీంతో అఖిల్ అప్పుడు మాట్లాడిన టోన్ ఏంటి? ఇప్పుడు మాట్లాడిన టోన్ ఏంటని మండిపడ్డాడు. అయినా లక్‌తో పాటు బిగ్‌బాస్ తల్చుకోవడం వల్లే అఖిల్ హౌస్‌లోకి మళ్లీ వచ్చాడని అభిజిత్ చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి ఈ ఇద్దరి మధ్య గొడవ రాజుకున్నట్లు తేటతెల్లమవుతోంది. (చదవండి: తిండి కోసం అతడి ఇంటికి వెళ్లాను: అరియానా)
Comments
Please login to add a commentAdd a comment